Home /News /telangana /

TDP FOCUS ON GHMC ELECTIONS CHANDRABABU NAIDU CONFIRMS STRATEGY AK

గ్రేటర్ ఎన్నికలపై టీడీపీ సరికొత్త వ్యూహం.. అలా ముందుకెళ్లాలన్న చంద్రబాబు

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

GHMC Elections: గ్రేటర్ ఎన్నికల్లో తాము కూడా బరిలో ఉండాలని టీడీపీ యోచిస్తోంది. చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెంచుతుండటంతో.. ఆ పార్టీ ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

    తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన టీడీపీకి జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంది. సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికీ టీడీపీ కొంత బలంగానే ఉందనే వాదన ఉంది. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు కొన్ని సీట్లు సాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న టీడీపీ.. ఆ దిశగా దృష్టి పెట్టింది. అమరావతి నుంచి నిన్న హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. నేడు గ్రేటర్ హైదరాబాద్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

    ఆ విధంగా టీడీపీ ముందుకు..
    అన్ని రకాల సమర్థవంతుడైన, బలమైన, గెలిచే అవకాశాలు ఎక్కువగా వాళ్లనే పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టాలని అన్నారు. ఆశావహుల జాబితాను నాలుగు వర్గాలుగా విభజించి అభ్యర్థులను ఎంపిక పూర్తి చేయాలన్న ఆయన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర స్థాయి నేతను ఇన్చార్జిగా నియమించి అభ్యర్థి సెలెక్షన్ నుండి గెలిపించే బాధ్యత వరకు అతనికి బాధ్యత ఇవ్వాలని అన్నారు. స్థానిక నాయకులు రాగద్వేషాలు లేకుండా గెలుపే ప్రధాన లక్ష్యంగా అభ్యర్థులను నిలబెట్టాలని కోరారు. హైదరాబాదులో లో పార్టీ బలపడితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభావం ఉంటుంది, ఈ అవకాశాన్ని పార్టీ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

    సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతంగా నిర్వహించండి, క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి ప్రతి ఇంటికి మన అభ్యర్థి వెళ్లాలని ఆదేశించారు. ఎన్నిక ఎప్పుడొచ్చినా పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలన్న ఆయన సోమ వారం నుండి ఎన్నిక ప్రక్రియలో చిరుకుగా పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ గెలుపుతోనే మన పార్టీ పటిష్టతకు అవకాశాలు ఏర్పడతాయని చంద్రబాబు అన్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే చంద్రబాబు రెండోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి పార్టీ నేతలతో చర్చించడంతో... టీడీపీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందనే చర్చ జరుగుతోంది.

    టీఆర్ఎస్ దూకుడు
    ఓ వైపు సాధ్యమైనంత తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించి.. ప్రత్యర్థులకు సమయం ఇవ్వకుండా దూసుకుపోవాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో తాము కూడా బరిలో ఉండాలని టీడీపీ యోచిస్తోంది. మొత్తానికి చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెంచుతుండటంతో.. ఆ పార్టీ ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Chandrababu naidu, GHMC Elections, Tdp, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు