హోమ్ /వార్తలు /తెలంగాణ /

Chandrababu Naidu: సీతక్కకు ధైర్యం చెప్పిన చంద్రబాబు.. ఆమె గురించి డాక్టర్లతో ఏం చెప్పారంటే..

Chandrababu Naidu: సీతక్కకు ధైర్యం చెప్పిన చంద్రబాబు.. ఆమె గురించి డాక్టర్లతో ఏం చెప్పారంటే..

సీతక్కకు ధైర్యం చెప్పిన చంద్రబాబు..

సీతక్కకు ధైర్యం చెప్పిన చంద్రబాబు..

ములుగు ‌ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్క ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు ఆరా తీశారు. సమ్మక్క చికిత్స పొందుతున్న ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు..ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సోమవారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్కను ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే సీతక్కకు ధైర్యం చెప్పారు. అలాగే సీతక్క ప్రజాసేవ, క్రమశిక్షణ తదితర అంశాలను చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వివరించారు. ‘ఆమె గొప్ప ఫైటర్. నక్సలైట్స్‌లో టీమ్ లీడర్‌గా పనిచేశారు. నేను అప్పట్లో ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చినప్పుడు ఆమె ముందుకువచ్చారు. చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారు’అని చంద్రబాబు డాక్టర్లకు తెలిపారు. అలాగే ధైర్యంగా ఉండాలని సీతక్కకు చెప్పారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సీతక్క.. చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ‘నా తల్లి వెంటిలేటర్‌ చికిత్స నుంచి బయటకు వచ్చిన తరువాత.. మీరు వచ్చి ఆమె ఆరోగ్యం గురించి అడిగింది, ఆస్పత్రిలో నాకు ధైర్యం ఇచ్చినవే ఆమె తెలుసుకునే మొదటి వార్త అవుతుంది . ధన్యవాదాలు చంద్రబాబు అన్న’అని సీతక్క పేర్కొన్నారు. ఇక, సీతక్క గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన సంగతి తెలిసిందే.

' isDesktop="true" id="904174" youtubeid="q2uB_FUwB5A" category="telangana">

ఇక, సీతక్క తల్లి అనారోగ్యంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక, నాలుగు రోజుల కిందట.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి రక్తదానం చేసేందుకు వెళ్తుండగా.. తమ బంధువులను పోలీసులు అడ్డుకున్నారని సీతక్క పోలీసులు మండిపడ్డారు. ఈ-పాస్ ఉన్నప్పటికీ కనీస కనికరం లేకుండా ప్రవర్తించారని మల్కాజ్‌గిరి డీసీపీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ములుగు జిల్లా కలెక్టర్ నుంచి ఈపాస్ అనుమతులు తీసుకున్నప్పటికీ.. తమ బంధువులకు జరిమానా విధించినట్లు ఆమె చెప్పారు. ఫైన్లు, చలానాల కన్నా మానవత్వం ముఖ్యమని అన్నారు.

First published:

Tags: Chandrababu Naidu, Hyderabad, MLA seethakka

ఉత్తమ కథలు