హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sankranti: కోడి పందేలపై పోలీసుల దాడులు.. పరుగు లంకించుకున్న పందెం రాయుళ్లు.. ఘటనా స్థలంలో 50 బైకులు. కార్లు.. కోళ్లు

Sankranti: కోడి పందేలపై పోలీసుల దాడులు.. పరుగు లంకించుకున్న పందెం రాయుళ్లు.. ఘటనా స్థలంలో 50 బైకులు. కార్లు.. కోళ్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కామారెడ్డి జిల్లా లో  అటవీ ప్రాంతం లో నిర్వహిస్తున్న కోడిపందేల (Chicken bet) స్థావరాల పై పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించారు

ఆంధ్రలో సంక్రాంతి (Sankranti) అంటే కోడి పందేలు (Cock fights).. తెలంగాణా లో పిండి వంటలు.. పంతంగి (కైట్స్ ) అని అందరికి తెలుసు.. అయితే కామారెడ్డి జిల్లా లో  అటవీ ప్రాంతం లో నిర్వహిస్తున్న కోడిపందేల (Chicken bet) స్థావరాల పై పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దాడుల్లో భారీగా వాహనాలు, 30 వేల నగదు.. 20 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్ర నుంచి ఉపాధి కోసం..

సంక్రాంతి పండగ (Sankranti festival) వచ్చిందంటే కోడి పందెం రాయుళ్లకు పండగే. ఆంధ్రాలోని గోదావరి జిల్లాల (Godavari districts)తో పాటు సరిహద్దుల్లో ఉండే తెలంగాణ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. ఆంధ్ర నుంచి ఉపాధి కోసం వచ్చిన మేస్త్రీలు.. తాపీ కార్మికులు ఇక్కడే స్థిరపడ్డారు.

కరోనా కారణంగా..

అయితే వీరు సంక్రాంతికి ప్రతి సంవత్సరం ఆంధ్రకు వెళ్లి కోడి పందాలు ఆడేవారు.  కరోనా కారణంగా వెళ్లలేక పోయారు. దీంతో ఇక్కడే కోడి పందాలు ఆడుతున్నారు. ఈ క్రమంలో వీటిని అరికట్టేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా (Kama reddy) మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారు లో కోడి పందేల స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు (task force Riads) నిర్వహించారు. ఈ మేరకు 50 బైకులు, 1కారు, 20పందెం కోళ్లు, 30 వేల నగదు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు..

పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకున్న వందలాది మంది పందెం రాయుళ్లు ముందుగానే పరుగు లంకించుకున్నారు. అయితే  ఎల్లారెడ్డి పేట కు చెందిన శివ ఆధ్వర్యంలో ఈ కోడి పందేలను (cock fights) నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. అయితే అతను తప్పించుకున్నాడని, 23 మంది పందెం రాయుళ్లను అదుపు లోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగమే కోడి పందాలు.. ఆంధ్రలో ఎన్ని ఆంక్షలు పెట్టిన పందేలు మాత్రం ఆగవు.. కానీ తెలంగా ణ లో మాత్రం కోడిపందేలు (Chicken fights) నేరంగా పరిగణిస్తారు.. ఏది ఏమైనా మేము ప్రతి యేడు కోడిపందాలు ఆడేవారిమీ మని ఆంధ్ర నుంచి వచ్చి ఎక్కడా స్థిర పడ్డవారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్​ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? 

First published:

Tags: Arrested, Cock fight, Kamareddy

ఉత్తమ కథలు