హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS politics : బండి సంజయ్ అరెస్ట్‌, నేరుగా రంగంలోకి దిగిన నడ్డా.. వారి వ్యుహం ఏమిటీ...

TS politics : బండి సంజయ్ అరెస్ట్‌, నేరుగా రంగంలోకి దిగిన నడ్డా.. వారి వ్యుహం ఏమిటీ...

TS politics : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌‌పై జాతీయ నాయకత్వం సిరియస్‌గా తీసుకుందా..? అందుకే నేరుగా ఆ పార్టీ అధ్యక్షుడు రంగంలోకి దిగుతున్నారా..?

  బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుతోపాటు ఒక ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం వెనక రాజకీయ కోణాలు కనిపిస్తున్నట్టు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. .అందుకే  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా రంగంలోకి దిగారు.. మరోవైపు సంజయ్ అరెస్ట్ తర్వాత 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. ఇందులో బాగంగానే నేడు చేపట్టనున్న క్యాండిల్ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొనున్నారు. అయితే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రావడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా సీరియస్‌గా టార్గెట్ చేసినట్టు రాజకీయ వర్గాల విశ్లేషణ, ఈ క్రమంలోనే బీజేపీ ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటుే మరోవైపు  ఇలా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా.. పార్టీని బలోపేతం చేయడంతో  వారి వైఖరిని ఎండగట్టేందుకు ఆపార్టీ నేతలు సిద్దమయ్యారు.

  ఇక బండి సంజయ్ అరెస్ట్ పరిణామాలపై కిషన్ రెడ్డి దృష్టి సారించారు.. ఆయన  సైతం ఉదయమే జైల్లో ఉన్న బండి సంజయ్‌కు పరామర్శించేందుకు నేరుగా జైలుకు వెళ్లారు. ఆయన్ను జైల్లో పరామర్శించిన అనంతర సంజయ్  కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లనున్నారు. ఆ తర్వాత గాయాల పాలైన కార్యకర్తలను కూడా ఆయన పరామర్శించారు. ఇలా ఉన్నత స్థాయి నేతలు డైరక్టుగా రంగంలోకి దిగడంతో టీఆర్ఎస్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయినట్టు కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ సైతం  కేంద్రాన్ని ఇదివరకే వరి విషయంలో టార్గెట్ చేశారు. ఆ తర్వాత ధర్నాలు, విమర్శలతో కేంద్రంపై దుమ్మెత్తి పోశారు.

  Extra marital affair : ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం.. మరో నలుగురు స్నేహితులు కలిసి..!

  ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై డైరక్ట్ పోరాటానికి దిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని నిర్భంధం పాలు చేస్తోంది. ఎక్కడికక్కడ ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేస్తూ.. వారి ప్రభావాన్ని తగ్గించేందుకు పావులు కదుపుతోంది.అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బీజేపీ ప్రజా పోరాటంలో ముందుకు సాగుతోంది. దీంతో ఇరు ప్రభుత్వాలు, పార్టీల మధ్య కొనసాగుతున్న పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

  First published:

  Tags: Bandi sanjay, Bjp, JP Nadda

  ఉత్తమ కథలు