ప్రణయ్ హత్యోదంతంపై తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు.ప్రణయ్ హత్యోదంతంపై పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ప్రణయ్ హత్యఘటపై స్పందించారు.

news18-telugu
Updated: September 19, 2018, 11:16 AM IST
ప్రణయ్ హత్యోదంతంపై తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన
తమ్మారెడ్డి భరద్వాజ (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ప్రణయ్ హత్యోదంతంపై పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, రామ్, రామ్ చరణ్ వంటి పలువురు హీరోలు ప్రణయ్ హత్యను తీవ్రంగా ఖండించారు. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ప్రణయ్ హత్యఘటపై స్పందించారు.

గ్లోబలైజేషన్‌తో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఇప్పటికీ  కొంతమంది పరువు కోసం హత్యలు చేయడం చాలా దారణమన్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ల పబ్బం కోసం ప్రజను మతాల వారీగా, కులాల వారీగా విడగొడుతున్నారని దుయ్యబట్టారు. మన నాయకులకు రాజకీయాలు ఇంపార్టెంట్. ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కానీ..దేశం ఇంపార్టెంట్ కాదని రీసెంట్‌గా జరిగిన ప్రణయ్ హత్యోదంతంతో స్పష్టమవుతోంది.


తన కులం కాదనే ఒకే ఒక్క కారణంతో అమృత తండ్రి మారుతి రావు..ఆమె భర్తను కళ్లెదుటే చంపించడం కన్నా దారుణం మరోకటి లేదన్నారు. మన దేశం సమాజం ఎటో పోతుందో అని తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా భర్తను కోల్పోయిన అమృతతో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యులకు తమ్మారెడ్డి భరద్వాజ తన సానుభూతి తెలియజేశారు.

ఇది కూడా చదవండి

ఈ సమాజం ఎటు పోతోంది..ప్రణయ్ హత్యపై రాంచరణ్ ఆవేదన..!

మనుషుల్లా ప్రవర్తించండి..ప్రణయ్ హత్యపై మనోజ్, రామ్ ఆవేదన
Published by: Kiran Kumar Thanjavur
First published: September 19, 2018, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading