పోలింగ్‌కు ముందే తలసాని ఇంటికి పండగొచ్చింది

తలసాని శ్రీనివాస్ యాదవ్(File Photo)

తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ తండ్రి అయ్యారు. సాయికిరణ్‌ భార్య మగబిడ్డకు జన్మనిచ్చారు.

  • Share this:
    ఎన్నికల పోలింగ్‌కు ఒక్క రోజు ముందే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పండుగ వచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ తండ్రి అయ్యారు. సాయికిరణ్‌ భార్య మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ తాత అయ్యారు. సాయికిరణ్‌కు కుమారుడు జన్మించడంతో తలసాని ఇంట్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. తలసాని సాయికిరణ్ ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. తలసాని తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తన వారసుడిగా సాయికిరణ్‌ను పోటీలో నిలిపారు.
    First published: