Paddy Troubles: ట్రాక్టర్ ఖాలీ కావాలంటే వారం ఆగాల్సిందే...రైస్ మిల్లుల వద్ద రైతుల ఇక్కట్లు

Paddy Troubles:  ట్రాక్టర్ ఖాలీ కావాలంటే వారం ఆగాల్సిందే...రైస్ మిల్లుల వద్ద రైతుల ఇక్కట్లు

వరి ధాన్యం ట్రాక్టర్ ఖాలీ చేయాలంటే వారం రోజులు పడుతోంది. ఓవైపు కరోనా మరోవైపు రైస్ మిల్లు యాజమాను వ్యవహరశైలీతో రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

వరి ధాన్యం ట్రాక్టర్ ఖాలీ చేయాలంటే వారం రోజులు పడుతోంది. ఓవైపు కరోనా మరోవైపు రైస్ మిల్లు యాజమాను వ్యవహరశైలీతో రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు ద‌ృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

  • Share this:
రైతులకు పంట వేసినప్పుటి నుండి అమ్మేవరకు అన్ని కష్టాలే..ఎప్పుడు ఏదో రూపంలో తనను వెన్నంటి ఉంటాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా...రైతులను ఆదుకోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తెలంగాణలో ఇటివల కురిసిన అకాల వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. పంటలు పండి తీరా అమ్ముకునేందుకు రెఢి అయిన సంధర్బంలో వానలు పడి పలు జిల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు వాటిని ఆరబెట్టి అమ్మకానికి తీసుకెళుతున్నారు. అయితే కొన్ని చోట్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పింది.

దీంతో చివరికి పండిన ధాన్యం అమ్మకాల తర్వాత సంభంధిత మిల్లులకు సరఫరా చేయడంలో కూడ ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. సకాలంలో మిల్లులకు చేర్చడం కోసం వాహనాలపైనే పడిగాపులు గాస్తున్నారు. ఆయా మిల్లుల్లో ధాన్యం దిగుమతి కావడం లేదు..దీంతో పలు రైసు మిల్లుల వద్ద రైతులు తెస్తున్న వాహనాలు బారులు తీరుతున్నాయి..ఇలా ఒక్కోసారి ట్రాక్టర్ ఖాలీ కావాలంటే వారం పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో రైతులు ధాన్యంతో రోడ్డుపైనే నిరీక్షించే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా రాష్ట్రంలో చాల చోట్ల రైతులు ఇక్కట్లు ఎదుర్కోంటున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఇలాంటీ సంఘటనలు అనేక మిల్లుల వద్ద కనబడుతోంది. అయితే రైతులు మాత్రం మిల్లుల వద్ద పడిగాపులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు చెబుతున్నట్టుగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
Published by:yveerash yveerash
First published: