• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TAKE OVER PRIVATE HOSPITALS AND GIVE FREE TREATMENT TPCC PRESIDENT UTTAM ASKED VRY HYD

Uttam kumar reddy : ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు వైద్యం అందించండి ..ఉత్తమ్

Uttam kumar reddy : ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు వైద్యం అందించండి ..ఉత్తమ్

ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు వైద్యం అందించండి ..ఉత్తమ్ ఉత్తమ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Uttam kumar reddy :తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత, నిర్లక్ష వైఖరి వల్లనే కరోనో ఉప ద్రవం ప్రజలను పీడిస్తుందని ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు

  • Share this:
    కొవిడ్ చికిత్సలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చుట్టుపక్కల రాష్ట్రాలు కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని,మరోవైపు కరోనా నివారణకు మందులు దొరకడం లేదని, ఆక్సిజన్, బెడ్స్, వెంటిలేటర్లు అసలే లభించడంలేదని, డబ్బులు పెట్టినా బెడ్స్ లేవని,ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

    పక్క రాష్ట్రాలలో ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్యం అందిస్తుంటే కేసీఆర్ మాత్రం అటు ఆయుష్మాన్ భారత్ కానీ, ఆరోగ్య శ్రీ కానీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    దేశంలో హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉందని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో అనేక ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు వచ్చాయని అన్నారు. ఇక్కడ వ్యాక్సిన్ తయారవుతుందని కానీ తెలంగాణలో ప్రజలకు వ్యాక్సిన్ లేదని, దేశంలో రేమిడిసివర్ మందు హెటిరో కంపెనీ హైదరాబాద్ లో తయారు చేస్తుందని, ఆ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని అయినా... మనకు రెమ్‌డెసీవర్ ఇంజక్షన్లు లభించడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సౌకర్యాలు పెద్దగా తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు..

    ఇక మే 21న మాజీ ప్రధానమంత్రి, మాజీ ఏఐసీసీ అధ్యక్షులు స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్బంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రజలకు సేవ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రతి బూత్ పరిధిలో కనీసం 50 మందికి మాస్కలు పంపిణీ చేయాలని, ఆసుపత్రుల వద్ద రోగుల బంధువులకు, ఆసుపత్రి సిబ్బందికి, ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు అందించాలని, మందులు పెద్దఎత్తున ఇవ్వాలని అన్నారు.
    Published by:yveerash yveerash
    First published: