వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యమన్న - జిల్లా కలెక్టర్..

వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యమన్న - జిల్లా కలెక్టర్..

శానిటేషన్ పనులు సరిగ్గా నిర్వహించడం లేదని సర్పంచ్, సెక్రెటరీలు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

 • Share this:
  నిజామాబాద్ జిల్లా: సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారు.. వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యమని, వారికి గ్రామస్తులంతా సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.
  గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల ఆకస్మిక తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో తిరిగి పారిశుద్ధ్య పనులను పరిశీలించి, శానిటేషన్ పనులు సరిగ్గా నిర్వహించడం లేదని సర్పంచ్, సెక్రెటరీలు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. హరిత హారంలో భాగంగా ఇంటర్నల్ రోడ్లకు ఇరువైపుల మొక్కలు ఇప్పటివరకు నాతనందుకు అధికారులపై మండిపడ్డారు. గ్రామంలో కంపోస్టు షెడ్, వైకుంఠధామం పనులు మధ్యలో ఆగడంపై సర్పంచ్ కు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూలై 15వ తేదీ వరకు గ్రామంలోని పనులన్నీ పూర్తి కావాలని 16వ తేదీ తాను మళ్ళీ వస్తానని పనులు పూర్తి కాకుంటే సర్పంచ్ పై గట్టి యాక్షన్ తీసుకుంటానన్నారు. నర్సరీని సందర్శించిన కలెక్టర్, నర్సరీలో మొక్కలు ఎండిపోవడం పై వన సంరక్షకునికి 2000 పెనాల్టీ వేయాలని గ్రామ సెక్రటరీని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి, గ్రామ పంచాయతీలో ట్రాక్టర్, ట్రాలి, టాంకర్, ఊరిలో వైకుంఠధామం, రైతు వేదికలు ఉండాలని మీరు అడగకముందే శాంక్షన్ చేసిందన్నారు.. వాటిని గ్రామస్తులు నిలబెట్టుకోవాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెట్టాలని అన్నారు.
  అనంతరం జిల్లా కలెక్టర్ మల్లాపూర్ గ్రామంలో కంపోస్టు షెడ్ పూర్తి అయినందున గ్రామ సర్పంచ్ కోరిక మేరకు టెంకాయ కొట్టి ప్రారంభించారు. వన సంరక్షకులకు పలు సూచనలు ఇచ్చారు. మొక్కల వద్ద పాదులు తీయాలని, రోడ్డు నీటుగా ఉంచాలని, మొక్కలకు వాటరింగ్ చేయాలని, ఊరు నీటుగా ఉంచాలని తెలిపారు.

   
  First published: