SXUAL HARRASMENT CASE FILED AGAINST SARPANCH IN KAMAREDDY DISTRICT VRY
Kamareddy : ఆడదైతే చాలు.. అంటున్న సర్పంచ్, ఏ పని కావాలన్నా తన వద్దకు రావాల్సిందేనంటూ వేధింపులు.. !
సర్పంచ్ ఆగడాలపై గ్రామస్థుల ఆందోళన
Kamareddy : మరో కాలకేయుడి లీలలు బయటపడ్డాయి... ఇప్పటికే వనమా రాఘవ చేసిన ఆకృత్యాలు బయటపడుతుంటే.. ఆ ఉదంతంతో ధైర్యం తెచ్చుకున్న ఓ వార్డు మెంబర్ తన గ్రామంలోని సర్పంచ్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది.
ఆయన ఓ గ్రామానికి సర్పంచ్, ప్రథమ పౌరుడుగా సేవలందిస్తూ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. గ్రామ మహిళల పాలిట కాలకేయుడుగా మారాడు.. అవసరాల కోసం తన వద్దకు వచ్చిన మహిళలను వేధిస్తూ.. కీచకుడిగా ప్రవర్తిస్తున్నాడు. కొత్త పించన్లు.. ప్రభుత్వ పథకాలు దక్కాలన్నా.. పోలీసు కేసుల్లో పైరవీలు చేయాలన్నా.. తన కోరిక తీర్చాలంటూ మహిళలను వేధిస్తున్నాడనే అరోపణలు ఎదుర్కొంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గాలిపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. మహిళల రక్షణకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ అవేమీ తనకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. మద్యం మత్తులో రోజుకో మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. గ్రామ ప్రజలను బిడ్డలుగా చూసుకోవాల్సిన అతను తన పక్కలోకి రావాలంటూ.. రాత్రి తనతో గడపాలంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడని గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యురాలు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు..
కాగా గతంలో కూడా సర్పంచ్ పలు మార్లు గ్రామ మహిళలను వేధించిన ఘటనలు ఉన్నాయి. గ్రామ పెద్దల సమక్షంలో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దంటు సర్పంచ్ ను మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆ సర్పంచ్ తీరులో మార్పు లేదు. కులం అనే గర్వంతో పాటు అధికార పార్టీ సర్పంచ్ నని తనను ఎవ్వరూ ఏమి చేయలేరనే ధీమాతో రెచ్చిపోతున్నట్టు ఆమె వాపోయింది..
ముఖ్యంగా తన కోరిక తీర్చితేనే ప్రభుత్వ పథకాలను అందేలా చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని గ్రామానికి చెందిన ఓ సైతం మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇక సర్పంచ్ వేధింపులకు తట్టుకోలేక సమావేశాలకు కూడా వెళ్లలేకపోతున్నట్టు తెలిపింది.. కాగా సర్పంచ్ నువ్వోస్తావా లేదా ఎవ్వరినైనా తీసుకువస్తావా అంటూ వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె వెళ్లలేక మా అబ్బాయి వెళితే మీ అమ్మను రమ్మను అంటూ బెదిరించాడని చెప్పింది.. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలంటూ కోరుతోంది.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.