తెలంగాణతో కలిసి స్విట్జర్లాండ్ అడుగులు...బయోఆసియా సదస్సు భాగస్వామిగా ఒప్పందం

17వ ఎడిషన్ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈ సదస్సుకు 55 దేశాల నుంచి 1800 మంది ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగ నిపుణులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. కాగా ఈ సదస్సుకు సదస్సుకు స్విట్జర్లాండ్‌ భాగస్వామి దేశంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది.

news18-telugu
Updated: December 10, 2019, 9:17 PM IST
తెలంగాణతో కలిసి స్విట్జర్లాండ్ అడుగులు...బయోఆసియా సదస్సు భాగస్వామిగా ఒప్పందం
తెలంగాణ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి
  • Share this:
17వ ఎడిషన్ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈ సదస్సుకు 55 దేశాల నుంచి 1800 మంది ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగ నిపుణులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. కాగా ఈ సదస్సుకు సదస్సుకు స్విట్జర్లాండ్‌ భాగస్వామి దేశంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో బయో ఆసియా-2020 సదస్సుపై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సులేట్ జనరల్ సిల్వానా రెన్గిల్ ఫ్రే, టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జయేష్ రంజన్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో వైద్య ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు చేస్తోందని, పలు ఫార్మాసుటికల్ కంపెనీలు స్విట్జర్లాండ్ కేంద్రంగా వెలిశాయిని, అలాంటి దేశంతో తెలంగాణ కలిసి పనిచేయడం ఆనందదాయకమని తెలిపారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఆంత్రప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహిస్తుందని, బయో ఆసియా సదస్సులో స్విట్జర్లాండ్ భాగస్వామి కావడంతో ఈ రంగంలో రాణించే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే స్విట్జర్లాండ్ డిప్యూటీ కౌన్సుల్ జనరల్ సిల్వానా రెనిగ్లి మాట్లాడుతూ..స్విట్జర్లాండ్, భారత్ హెల్త్ టెక్నాలజీ రంగంలో వ్యూహాత్మక భాగస్వాములని పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్ నగరం హెల్త్ టెక్ రంగంలో హబ్ లాంటిందని, బయో ఆసియా సదస్సు ద్వారా స్విట్జర్లాండ్ హెల్త్ టెక్ ఎకోసిస్టం హైదరాబాద్ కు పరిచయం చేస్తామని ఆమో అన్నారు. అలాగే టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి మాట్లాడుతూ స్విట్జర్లాండ్ నోవార్టిస్, లోంజా, ఫెర్రింగ్, లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీలకు జన్మస్థానమని, అటువంటి దేశంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం వల్ల హైదరాబాద్‌ ఈ రంగంలో రాణించే అవకాశం ఉందని తెలిపారు.
First published: December 10, 2019, 9:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading