హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sweeper to Entomologist : పీజీ చేసి.. రోడ్లపై చీపురు పట్టింది.. స్వీపర్ నుండి ఎంటమాలజిస్టుగా మారింది..

Sweeper to Entomologist : పీజీ చేసి.. రోడ్లపై చీపురు పట్టింది.. స్వీపర్ నుండి ఎంటమాలజిస్టుగా మారింది..

Sweeper to Entomologist

Sweeper to Entomologist

Sweeper to Entomologist : పీజీ చేసినా.. గర్వం లేదు.. ఇంట్లో చీపురు పట్టి ఊడ్చేందుకే నమోషిగా ఫీల్ అయ్యె ప్రస్తుత రోజుల్లో, ఓ ఉన్నత విద్యావంతురాలు రోడ్లపై చీపురు పట్టింది. పనిని మించిన దైవం లేదనే నమ్మకమే ఆమె జీవితంలో వెలుగులు నింపింది. తాను చేస్తున్న మున్సిపాలీటిలోనే స్వీపర్ నుండి అసిస్టెంట్ ఎంటమాలజిస్టుగా మారింది.

ఇంకా చదవండి ...

పరిస్థితులకు రాజీపడి ఓ మహిళ(woman) తాను కన్న కళలను పక్కనపెట్టింది. ఉన్నత ఉద్యోగాలు(job) చేయాల్సిన మహిళ లాక్‌డౌన్(lockdown) పరిస్థితులతో తన ఇష్టాలను పక్కన పెట్టింది. భర్త పిల్లలను కాపాడుకునేందుకు పెద్ద సహాసమే చేసింది. వారిని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా.. అవి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పాటు.. కరోనా (corona) పరిస్థితులు ఆమె ప్రయత్నాలకు కళ్లెం వేశాయి.. అయినా పరిస్థితులకు భయపడకుండా.. తాను చదివిన చదువును సైతం పక్కన పెట్టింది. ఒక మాములు చదువురాని మహిళలతో కలిసి గ్రేటర్ మున్సిపాలిటీలో (GHMC) రోడ్లు ఊడ్చేందుకు సిద్దమైంది. ఇలా ఆరు నెలలుగా రోడ్లను ఊడుస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

మిడియాలో కథనాలు

అయితే చేస్తున్న పనిలో పట్టుదల , పనిమీద ఉన్న శ్రద్ద ఆమెకు గర్తింపునిచ్చి మంచి ఉద్యోగాన్ని తెచ్చిపెట్టాయి.. తాను చేస్తున్న మున్సిపాలిటిలోనే స్వీపర్(Swweper) నుండి అసిస్టెంట్ ఎంటమాలజిస్టుగా నియమించారు. అయితే ఆమె కష్టాలను మీడియాలో(media) రావడంతో ఏకంగా మంత్రి కేటీఆర్(ktr) స్పందించారు. ఆ తర్వత స్పెషన్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సైతం ముందుకు వచ్చారు. మంత్రి ఆదేశాలతో ఆయన ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.

ఇది చదవండి : లడ్డూ తెచ్చిన తంట...! అప్పులు ఉన్నా.. వేలం పాటలో భర్త, చివరికి.. ?


ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన రజనీ

వివరాల్లోకి వెళితే... స్వీపర్ నుండి ఎంటమాలజిస్టుగా ఎదిగిన రజని Rajani) వరంగల్ రూరల్ (warangala)జిల్లా పరకాల, ఆమె చిన్నప్పటి నుండి చదువులో ప్రతిభ కనుబరుస్తూ.. తన జీవితంలో స్థిరపడాలని కళలు కన్నది. కాని ఆ కళలు మొత్తం పెళ్లి తర్వాత ఆవిరయ్యాయి. ఇంటర్‌తో పాటు డిగ్రీలో టాప్ మార్కులు సైతం తెచ్చుకుంది. కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో వందశాతం మార్కులు సాధించింది. అనంతరం అదే సబ్జెక్ట్‌లో పీజీ (PG)చేసింది. ఇక పీహెచ్‌డి (Phd)కోసం అర్హత కూడా సాధించింది. అదే సంధర్భంలో ఆమెకు హైదరాబాద్‌కు చెందిన ఓ అడ్వకేట్‌తో(advocate) పెళ్లి జరిగింది.

పెళ్లితో చదువుకు ఫుల్‌స్టాప్ 

దీంతో చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. పెళ్లి జరిగి పది సంవత్సరాలు గడుస్తోంది. ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారు. కాని సంసారం సాఫిగా సాగుతున్న సమయంలో విధి వక్రీకరించింది. మూడు పదుల వయస్సు లేని భర్త మూడు సార్లు హర్ట్ ఎటాక్‌కు (heart attck)గురయ్యాడు. ఆ తర్వాత అయన పూర్తి స్థాయిలో పని చేయలని పరిస్థితి. దీంతో ఇంటి వద్దే చిన్న కిరాణం పెట్టుకుని నడుపుతున్నాడు. ఆ దుకాణం ఆదాయం అంతంతమాత్రమే ఉండడంతో కుటుంబభారం రజనిపై పడింది.

ఇది చదవండి : రైల్వేలో 3093 ఉద్యోగాలు... ఆ క్వాలిఫికేషన్ ఉంటే చాలు


భర్త అనారోగ్యంతో కుటుంబ భారం 

ఓవైపు అత్తమామ, మరోవైపు భర్త , పిల్లలు అందరి భాద్యత కోసం ఉద్యగ వేటలో పడింది. కాని పరిస్థితులు అనుకూలించలేదు.. ఇంటివద్దే కొద్ది రోజులు కూరగాయలు అమ్మారు. కాని దానిపై జీవీతం వెల్లదీయడం కష్టంగా మారింది. కరోనా పరిస్థితుల్లో ఇతర ఉద్యోగాలు మృగ్యమయ్యాయి. దీంతో ఆమెకు మున్సిపాలిటీలో రోజువారి స్వీపర్‌గా అవకాశం వచ్చింది.

దీంతో వెనకా ముందు ఆలోచించలేదు.. కుటుంబ సభ్యులు వద్దన్నారు.. అయినా గంత్యంతరం లేదని భావించిన రజని చివరికి ఉదయమే నగర వీధులు ఊడ్చేందుకు చీపురు పట్టింది. ఇలా గత ఆరు నెలలుగా రోజువారి స్వీపర్‌గా చేస్తూ నెలకు పదివేల రూపాయలు సంపాదిస్తుంది. అందులో కొంతమేర రవాణ ఖర్చులకే పోతున్నా.. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తోంది.

 ఇది చదవండి : ఆ దేశాల్లో మహిళలు బికినీలు వేసుకుని తిరగొద్దంట  .. తిరిగితే ఏం చేస్తారో తెలుసా?


ముందు రోజు చీపురు పట్టి ఊడ్చేందుకు కొంచెం ఇబ్బంది పడ్డా.. అలా కుటుంబ భాద్యత కోసం రోజూ అలవాటు చేసుకుంది. అయితే ఆమె కష్టాన్ని మీడియా ప్రతినిధులు గుర్తించారు. ఉన్నత చదువులు చదివి రోడ్లు ఊడ్వడం పై ప్రింట్ మీడియాలో రజని కష్టాల పేరు మీద కథనాలు వెలువడ్డాయి.

స్వీపర్ నుండి ఎంటమాలజిస్టుగా..

మీడియా కథనాలతో మంత్రి కేటీఆర్ (ktr)స్పందించారు. రజనీకి ఉద్యోగం కల్పించాలని గ్రేటర్ మున్సిపాలిటీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో స్పందించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్(lokesh kumar) ఆమెకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించారు. మున్సిపాలిటిలోని అసిస్టెంట్ ఎంటమాలజిస్టుగా(Entomologist ) అవకాశం ఇచ్చారు.. ఆ తర్వాత ఆమె నియామక పత్రాలను మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌‌ను కలవడంతో రజనీకి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

First published:

Tags: GHMC, Hyderabad, KTR

ఉత్తమ కథలు