వైట్ కాలర్ జాబ్ చేస్తున్న భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. హాయిగా సాగిపోతున్న కాపురంలో ఆమె ఎందుకలా చేసిందో అంతు చిక్కడం లేదు. కలత చెందిందో లేక కలహాలే ఆమెను ప్రాణాలు తీసుకునేందుకు ఉసిగొల్పాయో తెలియదు. భర్త ఆఫీస్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్లగానే ఇంట్లోని బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. మధ్యాహ్నం ఇంటికొచ్చిన భర్తకు భార్య విగత జీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో షాక్ అయ్యాడు. వెంటనే భార్య మృతదేహాన్ని కిందకు దింపి పోలీసులకు సమాచారమిచ్చాడు. మంచిర్యాల(Mancherial)జిల్లా కేంద్రంలో జరిగిన వివాహిత జ్యోతి(Jyothi) ఆత్మహత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. చనిపోయిన మహిళ భర్త మంచిర్యాల మున్సిపల్ కమిషనర్(Municipal commissioner) నల్లమల్ల బాలకృష్ణ(Nallamalla Balakrishna)కావడంతో ఈవార్త అందరికి క్షణాల్లోనే చేరిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ భార్య మృతి..
మంచిర్యాలలోని ఆదిత్య ఇన్‌క్లేవ్‌లో నివాసముంటోంది మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఫ్యామిలీ. భార్య జ్యోతి, పిల్లలు రిత్విక్, భవిష్యలతో హ్యాపీగా ఉంటున్నారు. అయితే మంగళవారం పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత భర్త ఆఫీస్‌కు వెళ్లడంతో జ్యోతి తలుపు గడిపెట్టుకొని బెడ్రూంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు తలుపు లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశాడు. భార్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమె శవాన్ని కిందకు దింపి పోలీసులకు జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేశాడు.
అనుమానాస్పదమృతి..
స్పాట్‌కి చేరుకున్న పోలీస్ అధికారులు ఘటన స్తలాన్ని పరిశీలించారు. మృతురాలు మున్సిపల్ చైర్మన్ భార్య కావడంతో స్థానిక నేతలతో పాటు ప్రభుత్వ అధికారులు చాలా మంది వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కన్నతల్లి విగతజీవిగా పడివుండటంతో ఏం అర్ధం కాక కన్నీరు పెట్టుకోవడం అందర్ని తీవ్రంగా బాధించింది. అయితే జ్యోతి ఆత్మహత్య కేసులో ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదంటూ ఆందోళన చేపట్టారు. ఉదయం తమతో వీడియో కాల్ మాట్లాడిందని ..చంపేసేలా ఉన్నాడని ఫోన్‌లో చెప్పినట్లుగా వారు ఆరోపించారు.
అదనపు కట్నం కోసమేనా..?
తొమ్మిదేళ్ల క్రితం ప్రస్తుతం మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న బాలకృష్ణకు కట్న,కానుకలు ఇచ్చి వివాహం చేశారు జ్యోతి తల్లిదండ్రులు. పెళ్లి సమయంలో బాలకృష్ణ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారని..ప్రస్తుతం ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన నాటి నుంచి అదనపు కట్నం కావాలంటూ భార్య జ్యోతిని వేధించే వాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.ఈవిషయంలో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారని..ఆయినా అతను అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు. జ్యోతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.