శాంతి భద్రలను కాపాడడంతో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారా..? జై భీం సినిమాలో పేర్కొన్నట్టుగా అణగారిన వర్గాలపై పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారా.. ఇప్పటికే మరియమ్మ కేసులో ఇబ్బందులు పడుతున్న పోలీసులపై తాజాగా సూర్యపేట, నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు దేనికి సంకేతం..ఇప్పుడు ఇవే సంఘటనలు తాజాగా అటు ప్రతిపక్షాలకు ఇటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.
గత కొద్ది రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ అనే మహిళలను ఆమె కొడుకు దొంగతనం చేసిన కేసులో విపరీతంగా కొట్టారు. దీంతో దెబ్బలకు తాళలేక చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయింది. దీంతో ఆ కేసులోనే రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం స్థానిక పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడింది. దీంతో ఆ కేసులో సంబంధిత స్టెషన్ ఇంచార్జ్ తో సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సైతం సస్పెండ్ చేశారు. కాగా ఈ కేసును సీబీఐకి ఇచ్చేందుకు హైకోర్టు సిద్దమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇక తాజాగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో ఇటీవల ఏపూరులోని బెల్టుషాపులో చోరీ జరిగింది. సీసీ పుటేజీ ఆధారంగా రామోజీతండాకు చెందిన బానోతు నవీన్‌ను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ చోరీల్లో తనతో పాటు మరికొందరు ఉన్నట్లు విచారణలో నవీన్ వెల్లడించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రామోజీతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ను బుధవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.
ఇది చదవండి : 4 నెలలు కాదు..7 సంవత్సరాలుగా పెండింగ్.. నీటి వివాదంపై మంత్రి హరీష్ రావు..
రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు తండా సర్పంచ్‌కు ఫోన్ చేసి వీరశేఖర్‌ను తీసుకెళ్లాలని చెప్పారు. కాగా వీరశేఖర్‌ను విపరీతంగా చితకబాదడంతో నడవలేస్థితికి చేరుకున్నాడు. చేయని దొంగతనాన్ని ఒప్పుకోమని విపరీతంగా కొట్టి మూత్రం కూడా తాగించినట్టు వీరశేఖర్ చెప్పడంతో గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించిన పరిస్థితి నెలకొంది. దీంతో సంఘటనకు బాధ్యుడైన ఎస్సైని వీఆర్‌కు అటాచ్ చేస్తూ... జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటీ ఆరోపణలు కూడా వచ్చాయి. ఓ పేకాట కేసులో ఒకరిని కొట్టడడంతో ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.. అయితే చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి చనిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసులు కొట్టడడం వల్లే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ వరుస సంఘటనతో పోలీసులపై పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే ఇలాంటీ కేసులు ఇటివలే ఎక్కువగా జరుగుతున్నాయా.. లేక పాత పద్దతులు అలాగే కొనసాగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ సంఘటనలతో ఇటివల వచ్చిన జై బీం సినిమా ప్రతిబింభిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు కూడా పోలీసులపై ఇలాంటీ ఆరోపణలే చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana Police