ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్.. ఆ తర్వాత ఏమైదంటే..

ప్రతీకాత్మక చిత్రం

  • Share this:
    ఆత్మహత్య యత్నానికి ముందు ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ అతని ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు జిల్లాలోని బండమీది చందుపట్లకు చెందిన మధుసూదన్‌రెడ్డి గతంలో అన్నెపర్తి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. అయితే ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న మధుసూదన్‌రెడ్డిని సైకోలా వ్యహరిస్తున్నాడంటూ.. కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వదిలేశారు.

    ఈ క్రమంలో కుటుం సభ్యులు దూరం పెట్టడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు మధుసూదన్‌రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మధుసూదన్‌రెడ్డి కృష్ణా జిల్లా పెనుగ్రంచిప్రోలులో ఉన్నట్టు గుర్తించి.. అతన్ని రక్షించారు.
    Published by:Sumanth Kanukula
    First published: