విద్యుత్ ఉద్యోగులపై తెలంగాణకు సుప్రీంకోర్టు ఆర్డర్...

ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేసిన ఉద్యోగులకు తెలంగాణ సంస్థలే జీతాలివ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేసిన ఉద్యోగులకు తెలంగాణ సంస్థలే జీతాలివ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఎంప్లాయిస్ విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రిలీవ్ చేసిన 584 మందికి తెలంగాణ విద్యుత్ సంస్థలే శాల‌రీస్ ఇవ్వాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులపై భేదాభిప్రాయాలు ఉంటే ధర్మాధికారి కమిటీ వద్దే స‌రిచేసుకోవాల‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో శాల‌రీస్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మెరిట్స్ జోలికి వెళ్లలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఇటీవల ఏపీ రిలీవ్ చేసిన 584 మందికి జీతాలు ఇవ్వాలని తెలంగాణ స‌ర్కార్ ను ఆదేశించింది. విభజన వివాదంతో, సంబంధం లేని ఏపీకి చెందిన 584 మంది ఉద్యోగులను జస్టిస్ ధర్మాధికారి తెలంగాణకు కేటాయించారు. దీనిపై తెలంగాణ జెన్‌ కో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉద్యోగుల కేటాయింపులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ధర్మాధికారి వద్దే పరిష్కారం చేసుకోవాలని ఆదేశించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: