గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లులపై అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో గవర్నర్‌కు(Governor Tamilisai) నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై వైఖరి తెలియజేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది. దీంతో తదుపరి విచారణ ఏ విధంగా సాగుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
కొన్ని నెలలుగా పెండింగ్ బిల్లుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం నడుస్తోంది. గవర్నర్ ఎంతకీ పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదంటూ.. గవర్నర్ తమిళిసై అనుసరిస్తున్న వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది శాసనసభ ఆమోదించిందిన 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిట్ పిటిషన్ వేశారు. ఈ రిట్ పిటీషన్‌లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే..
గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల్లో పలు బిల్లులు ఆమోదం పొందాయి. వర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది.
హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న మామిడి పండ్ల ధరలు.. ఇదే కారణం.. !
KTR: అవన్నీ ప్రజలకు వివరించండి.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు.. పార్టీ ప్లీనరీపై క్లారిటీ
వాటి ఆమోదం అనంతరం మరుసటి రోజున నిబంధనల మేరకు రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టరూపం పొంది అమల్లోకి వస్తాయి. సాధారణంగా వారం, పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్ ఆమోదం లభించింది. మిగిలిన బిల్లులకు ఆమె నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ఫైల్స్ అన్ని ప్రస్తుతం రాజ్ భవన్ పెండింగ్ లోనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.