హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Crackers Ban: తెలంగాణలో దీపావళి టపాసులపై సుప్రీంలో గుడ్ న్యూస్

Telangana Crackers Ban: తెలంగాణలో దీపావళి టపాసులపై సుప్రీంలో గుడ్ న్యూస్

మామూలు బాణాసంచాలకు, గ్రీన్ క్రాకర్స్‌కు మధ్య తేడా ఉంది. మామూలు టపాసులు కాల్చినప్పుడు అందులో ఉండే రసాయనాలు, పొగ వాతావరణంలోకి చేరుతుంది.

మామూలు బాణాసంచాలకు, గ్రీన్ క్రాకర్స్‌కు మధ్య తేడా ఉంది. మామూలు టపాసులు కాల్చినప్పుడు అందులో ఉండే రసాయనాలు, పొగ వాతావరణంలోకి చేరుతుంది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి ప్రజలకు అవకాశం లభిస్తుంది.

  తెలంగాణలో దీపావళి పండుగ రోజు టపాసులు బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి ప్రజలకు అవకాశం లభిస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈనెల 12న అదేశించింది. దీపావళి పండుగలో బాణాసంచా పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు లో న్యాయవాది ఇంద్రప్రకాష్ పిల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతారని పిటిషనర్ వాదించారు. బాణాసంచా కాలిస్తే వాటి వలన వచ్చే పొగతో ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు పడుతారని పిటిషనర్ అన్నారు. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది. ఇప్పటి వరకు తెరిచిన షాపులను మూసి వేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

  ఎవ్వరూ క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది.

  అయితే, పండుగకు రెండు రోజుల ముందు హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆర్డర్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది. గ్రీన్ క్రాకర్స్ విక్రయించడానికి అనుమతి ఇచ్చింది. అలాగే కాల్చడానికి రెండు గంటలు అనుమతులు ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.

  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది?

  ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో నవంబరు 9 అర్ధరాత్రి నుంచి నవంబరు 30 వరకు అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ సంపూర్ణ నిషేధం విధించింది. నవంబరులో గతేడాది కంటే గాలి నాణ్యత తక్కువగా ఉండే దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని ట్రిబ్యునల్ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ట్రిబ్యూనల్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిని ట్రిబ్యునల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని వెల్లడించింది. దీపావళి, క్రిస్మస్‌, న్యూఇయర్ వేడుకల్లో బాణసంచా పేల్చుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. కాలుష్యంతో కొవిడ్‌-19 వైరస్‌ మరింత వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున వాయు కాలుష్య నియంత్రణకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Diwali 2020, Supreme Court, Telangana

  ఉత్తమ కథలు