Ganesh Immersion : సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఒకే సంవత్సరం అంటూ వ్యాఖ్య

పీవోపీ విగ్రహాలపై సుప్రీం గ్రీన్ సిగ్నల్

Ganesh Immersion : హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే.. ఈ ఒక్క సంవత్సరం వరకే అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఈ సంవత్సరం హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుప్రీం తీర్పుతో అటు అధికారులు ,ఇటు భక్తులు అనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఊపిరి పీల్చుకున్నారు.

  • Share this:
    హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో(hussain sagar) గణేశ్‌ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ జీహెచ్‌ఎంసీ(ghmc) దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం(supreme court) నేడు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ (green signal)ఇచ్చింది..

    కాగా హైకోర్టు (high court)తీర్పుతో ఎన్నడు లేనట్టుగా హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి (ganesh immersion)తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాలుష్యానికి కారణం అవుతున్న పీఓపి విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడం పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి నిరాకరించింది.

    ఇది చదవండి : సైదాబాద్ నిందితుడు ఆత్మహత్య.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడ్డట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం


    దీంతో జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్‌కుమార్ (lokesh kumar) మంగళవారమే సుప్రీంకోర్టులో స్పేషల్ లీవ్ పటిషన్ ధాఖలు చేశారు. అయితే బుధవారం పిటిషన్ ధర్మాసనం ముందుకు వచ్చిన నేపథ్యంలోనే గురువారం విచారణ చేపట్టింది.

    పిటిషన్‌ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ,(nv ramana) జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులు చివరి నిమిషంలో వెలువడినందున ఈ సంవత్సరం అందులో కొన్ని మినహాయింపులు కోరుతున్నట్లు జీహెచ్ఎంసీ ధర్మాసనాన్ని కోరింది. హైకోర్టు ఉత్తర్వుల్లోని చాలా అంశాలకు తాము కట్టుబడి ఉంటామని, ఒకట్రెండు అంశాలను మాత్రం తక్షణం అమలు చేయలేమని పేర్కొంది.

    ఇది చదవండి : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. రైల్వే ట్రాక్ పై మృతదేహం


    దీంతో ఈ సంవత్సరం నిమజ్జనానికి అనుమతి ఇచ్చిన సుప్రీం ధర్మాసనం.. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్యకారకంగా మారిపోయిందని, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించింది. నిమజ్జనంపై ఏటా ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు వస్తున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది.

    ఇది చదవండి : భర్తను చున్నితో ఉరిపెట్టింది... 11 ఏళ్ల కొడుకు సాక్ష్యంతో బుక్‌ అయింది.. !


    మరోవైపు హైకోర్టు తీర్పు అప్పుడే ఖైరాతాబాద్(khairatabad) గణేషుడిపై పడింది. కోర్టు ఆదేశాలతో రానున్న సంవత్సరం విగ్రహ తయారీపై ఉత్సవ కమీటి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సంవత్సరం ఖైరతాబాద్ గణేషుడి విగ్రహాన్ని మట్టితోనే తయారు చేసి అక్కడే నిమజ్జం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పుతో రానున్న సంవత్సరం పూర్తిగా మట్టి విగ్రహాల తయారితో పాటు పీవోపి విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
    Published by:yveerash yveerash
    First published: