హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ravi Prakash: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఊరట.. ఆ పిటిషన్‌‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు

Ravi Prakash: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఊరట.. ఆ పిటిషన్‌‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు

రవిప్రకాశ్(ఫైల్ ఫొటో)

రవిప్రకాశ్(ఫైల్ ఫొటో)

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు రవిప్రకాశ్‌కు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ దాఖలు చేసిన పిటిష‌న్‌పై సుప్రీం కోర్టు కొట్టివేసింది. వివరాలు.. టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి రవిప్రకాశ్‌‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే మధ్య ఈ డబ్బును తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు 2019 అక్టోబర్‌లో కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈడీ వర్గాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ నమోదు చేశాయి.

అయితే ఈడీ కేసులో తనను అరెస్టు చేయకుండా బెయిల్‌ మంజూరు చేయాలని రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఆయనకు శుక్రవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే రవిప్రకాశ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ.. సుప్రీం కోర్టును కోరింది. అయితే అందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. బెయిల్‌పై ఉన్న రవిప్రకాశ్ షరతులు ఉల్లంఘించారా అని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. అన్ని పరిశీలించాకే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని తెలిపింది. బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన ఈడీ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇక, గత నెలలలో కొత్త పాస్‌పోర్టు జారీకి ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని కోరుతూ రవిప్రకాశ్‌ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. తనను అన్యాయంగా టీవీ9 డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించారని అన్నారు. టీవీ9 కార్యాలయంలోని కేబిన్‌లోనే తన పాస్‌పోర్టు, విలువైన పత్రాలు, కొంత నగదు ఉండిపోయిందని రవిప్రకాశ్‌ తన పిటిషన్లలో పేర్కొన్నారు.

First published:

Tags: Ravi prakash, Supreme Court, TV9

ఉత్తమ కథలు