దిశ నిందితులు చనిపోయిన షాద్‌నగర్ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. నిందితులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నారని ఆయన కోర్టుకు వివరించారు. పోలీసులపై కాల్పులు జరిపారని.. రాళ్లు రువ్వారని తెలిపారు. నిందితులు తాము లాక్కున్న రివాల్వర్స్తోనే పోలీసులపై కాల్పులు జరిపారా అని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బోబ్డే ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన ముకుల్ రోహత్గీ... వాళ్లు కాల్చారు కానీ బుల్లెట్ల నుంచి పోలీసులు తప్పించుకున్నారని వివరించారు.
కాల్పులపై ప్రత్యేకంగా తాము దర్యాప్తు చేయాలనుకుంటున్నామని సీజేఐ అన్నారు. కోర్టు ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా లేదని రోహత్గీ అన్నారు. ఎన్కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు. గన్స్ లాక్కోవడంపై FIR నమోదైందని అన్నారు. అయితే చనిపోయిన నిందితులకు వ్యతిరేకంగా FIR ఉందని పిటిషనర్ జీఎస్ మణి పేర్కొన్నారు. సిట్‌తో పాటు సమాంతర దర్యాప్తునకు సీజేఐ ప్రతిపాదించగా... ఇందుకు ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని రోహత్గీ చెప్పినట్టు తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.