SUPER SPECIALITY HOSPITAL TO SINGARENI FUNDS RELEASED TODAY VRY
Singareni : సింగరేణికి సూపర్ స్పెషాలిటి.. రామగుండంలో మెడికల్ కాలేజీ..
ప్రతీకాత్మక చిత్రం
Singareni : సింగరేణి కార్మిక ప్రాంతలో సూపర్ స్పేషాలిటి ఆసుపత్రితోపాటు మెడికల్ కాలేజి కళ నెరవేరబోతుంది. త్వరలో ఆ ప్రాంతానికి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి 500 కోట్ల రూపాయల నిధుల మంజూరుకు బోర్డు ఆమోదం తెలిపింది.
సింగరేణి కార్మికుల కళ నెరవేరనుంది. గత కొన్నాళ్లుగా ఊరిస్తున్న సింగరేణి ప్రాంతంలో ఆసుపత్రికి నిధులు మంజూరయ్యాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ గతంలో మెడికల్ కాలేజీ కోసం ప్రజలకు రెండేళ్ల క్రితం హామి ఇచ్చారు.. దీంతో రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సింగరేణి సంస్థ రూ.500 కోట్లు మంజూరు చేస్తూ నేడు నిర్ణయం తీసుకుంది. ఇవాళ కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో బోర్డ్ తన అంగీకారం తెలిపింది.
దీంతో రామగుండం ఏరియాలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ఖరారైంది. వైద్య కళాశాలతో పాటు పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రామగుండం ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎండీ శ్రీధర్ తెలిపారు.
ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో సింగరేణి సంస్థ ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 500 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సూచించగా .. సంస్థ సీఎండీ శ్రీధర్ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నెల 10వ తేదీన బోర్డు ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచగా, దీనికి బోర్డు తన ఆమోదం తెలిపింది.
సింగరేణి నిధులతో ఏర్పాటు చేసే ఈ వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హైదరాబాద్ వంటి పట్టణాల్లో లభించే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు కూడా అందజేయనున్నారు. దీనివల్ల సింగరేణి కార్మికులు, రిటైర్ అయిన కార్మికులు, వారి కుటుంబీకులకే కాకుండా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాంత విద్యార్థులకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులో ఉండాలన్న కార్మికుల, స్థానికుల చిరకాల కోరిక మరో రెండేళ్లలో సాకారం కానుంది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.