హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఏపీలో కోర్టులకు సెలవులు.. ఎప్పట్నుంచి అంటే..

ఏపీలో కోర్టులకు సెలవులు.. ఎప్పట్నుంచి అంటే..

ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)

ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)

హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రెబ్యునల్, లేబర్ కోర్టుుల, అన్ని జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈనెల 26 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులు ఉండగా, జూనియర్ సివిల్ జడ్జి, రెంట్ కంట్రోలర్స్ కోర్టులకు జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్‌లోని కోర్టులకు వేసవి సెలవులు ప్రకటించారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలోనూ దాదాపు 45 రోజులుగా కోర్టు కార్యకలాపాలపై ప్రభావం పడింది. తాజాగా మళ్లీ కోర్టులకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు కేసులపై ప్రభావం పడనుంది. వాస్తవానికి కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా కోర్టుల కార్యకలాపాలపై ప్రభావం పడిన నేపథ్యంలో వేసవి సెలవులు రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఏపీలోని దాదాపుగా అన్నికోర్టులకు వేసవి సెలవులు వర్తించనున్నాయి. హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రెబ్యునల్, లేబర్ కోర్టుుల, అన్ని జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈనెల 26 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులు ఉండగా, జూనియర్ సివిల్ జడ్జి, రెంట్ కంట్రోలర్స్ కోర్టులకు జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. కోర్టులు మళ్లీ జూన్ 12వ తేదీ తర్వాత తెరుచుకోనున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP High Court, High Court

ఉత్తమ కథలు