Sangareddy : రైతు బంద్... చెరుకు మద్దతు ధర కోసం రోడ్డెక్కిన అన్నదాతలు..

గత సంవత్సరం కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా యాజమాన్యం మాత్రం తమ మొండి వైఖరి వీడడం లేదని వాపోతున్నారు. దీంతో తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు చవి చూడాల్సి పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

Sangareddy : బంధులంటే రాజకీయ పార్టీలు , లేదా ప్రజా సంఘాలు పిలుపునిస్తాయి.. కాని ఇక్కడ మాత్రం బంధులను రైతులు పిలుపునిస్తారు.. అది కూడా మద్దతు ధర కోసం వేలాది మంది రైతులు రోడ్లమీదకు వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు.

  • Share this:
    Sangareddy , cheruku formers, rythu Bandh, telangana news, చెరుకు పంట, రైతుల బంద్, జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
    రైతులు రోడ్ల మీదకు వచ్చి బంధులు రాస్తారోకోలు నిర్వహించడం తెలంగాణలో దాదాపు తక్కువనే చెప్పాలి. తమ హక్కులతో పాటు పంటల మద్దతు ధర కోసం ప్రభుత్వాలు, వ్యాపారాలు చెప్పిందే వేదంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పద్దతులు.


    Sangareddy , cheruku formers, rythu Bandh, telangana news, చెరుకు పంట, రైతుల బంద్,   జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
    అయితే ఆ విధానాలు కొంతమంది రైతులకు మేలు చేకూరుస్తుంటే మరికొంత మంది రైతులకు మాత్రం అన్యాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర విధానాలతో పాటు ప్రైవేటు వ్యాపారుల విధానాలు కారణం అవుతున్నాయి.


    Sangareddy , cheruku formers, rythu Bandh, telangana news, చెరుకు పంట, రైతుల బంద్,   జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
    ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని చెరుకు రైతులు ఆందోళనబాట పట్టారు. తమ చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానిక ట్రైటెండ్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవంభిస్తున్న వైఖరికి నిరసనగా నియోజకవర్గంలో నేడు బంద్‌ను నిర్వహిస్తున్నారు.


    Sangareddy , cheruku formers, rythu Bandh, telangana news, చెరుకు పంట, రైతుల బంద్, జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
    ఇందుకోసం ఆ ప్రాంతంలోని రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని మొత్తం 16వేల ఎకరాల్లో పండించిన చెరుకు రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యాజమాన్యాలు తీసుకుంటున్న వైఖరికి నిరసగా ఆందోళన చేపట్టారు.


    Sangareddy , cheruku formers, rythu Bandh, telangana news, చెరుకు పంట, రైతుల బంద్,   జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
    అయితే రైతులు చేపట్టిన బంధుకు స్థానిక వ్యాపారులు పూర్తిగా సహకరించడం కొసమెరుపు. సాధారణంగా రాజకీయ పార్టీల బంధులకే ఎక్కువగా స్పందన ఉంటుంది. కాని ఇక్కడ మాత్రం రైతులకు మద్దతుగా పలువురు వ్యాపారులు ముందుకు వచ్చి స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొంటున్నారు.


    Sangareddy , cheruku formers, rythu Bandh, telangana news, చెరుకు పంట, రైతుల బంద్,   జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
    దీంతో జహిరాబాద్ ప్రాంతం మొత్తం రైతు బంద్ లోకి వెళ్లింది. ముఖ్యంగా ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా మద్దతు ధర ఇవ్వకుండా రెండు సంవత్సరాలుగు చెరకు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


    Sangareddy , cheruku formers, rythu Bandh, telangana news, చెరుకు పంట, రైతుల బంద్, జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
    గత సంవత్సరం కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా యాజమాన్యం మాత్రం తమ మొండి వైఖరి
    వీడడం లేదని వాపోతున్నారు. దీంతో తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు చవి చూడాల్సి పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.


    Sangareddy , cheruku formers, rythu Bandh, telangana news, చెరుకు పంట, రైతుల బంద్,   జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా
    కనీసం ఈ సంవత్సరమైన ప్రకటించిన మద్దతు ధరకు ఆ ప్రాంతంలో పండిన చెరుకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఫ్యాక్టరీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. చెరుకు కొనుగోలు విషయంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published: