హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.. ఒక్కరోజు తేడాలోనే 15 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం ఒక్కరోజునే 36 నుండి 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నగరంలో నమోదు అయ్యాయి.. ఇలా సడెన్ గా ఉష్ణోగ్రతలు పెరగడంతో నగర ప్రజలు అతలాకుతలం అయ్యారు. భానుడి దెబ్బకు రోడ్లపై ప్రయాణించేవారితో పాటు ఇళ్లలో ఉన్న సామాన్యులు విలవిలాడిపోయాడు. అత్యవసరంగా లేదా రోజు వారి పనులకు వచ్చే వారు పెరిగిన ఉష్ణోగ్రతలకు అల్లాడిపోయారు.
అయితే అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడడంతో.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్టు వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలు నేరుగా శరీరంపై పడితే గుండెపోటుకు గురయ్యె అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు కొవిడ్ సోకిన రోగులు సైతం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత ద్వారా హార్ట్ ఎటాక్ తోపాటు మానసికంగా కూడా ప్రభావం అయ్యె అవకాశాలు ఉండడం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు.
Siddipet : విషపు ఇంజక్షన్లతో కుక్కలను చంపించిన సర్పంచ్.. మేనకా గాంధీకి ఫిర్యాదు.
అయితే ఇలాంటీ సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాంటప్పుడే ఉష్ణోగ్రతల్లోని మార్పులు వచ్చినా.... తట్టుకునే శక్తి వస్తుందని చెప్పారు.
మరోవైపు రానున్న అయిదు రోజులు సైతం ఇదే పరిస్థితి ఉండవచ్చంటూ వాతవరణశాఖ అధికారులు హెచ్చరించారు. మంగళవారం 40 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Weather report