హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..

నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం కారణంగా జీహెచ్ఎంసీ అలెర్ట్ అయింది. అప్రమత్తంగా ఉండాలంటూ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్‌ఎఫ్ టీమ్‌లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు ఆదేశించారు.

news18-telugu
Updated: June 3, 2019, 5:27 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..
నగరంలో భారీ వర్షం
news18-telugu
Updated: June 3, 2019, 5:27 PM IST
నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకూ ఉక్కిరిబిక్కిరైన ప్రాంతాలన్నీ ఈ వర్షం దెబ్బతో ఒక్కసారిగా జలమయంగా మారాయి. పంజాగుట్ట, అమీర్‌పేట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, అల్వాల్, యూసఫ్‌గూడ, చందానగర్ ప్రాంతాల్లో బోరున వర్షం కురిసింది. దీంతో.. రహదారులన్నీ నీటిమయంగా మారాయి. పలుచోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ పెరిగిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీగా వర్షం రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులని తలపించాయి.

నగరంలో భారీగా వర్షం

నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం కారణంగా జీహెచ్ఎంసీ అలెర్ట్ అయింది. అప్రమత్తంగా ఉండాలంటూ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్‌ఎఫ్ టీమ్‌లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు ఆదేశించారు.

నగరంలో భారీ వర్షం
కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.
మొత్తానికీ భరించలేని ఎండలతో అల్లాడిన జనానికి కురుస్తున్న వర్షం కాస్తా రిలీఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు.
First published: June 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...