హోమ్ /వార్తలు /తెలంగాణ /

Polavaram: పోలవరంపై తేల్చేసిన కేంద్రం.. తెలంగాణ ప్రతిపాదనకు ససేమిరా..

Polavaram: పోలవరంపై తేల్చేసిన కేంద్రం.. తెలంగాణ ప్రతిపాదనకు ససేమిరా..

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)

Polavaram: 2009, 2011లో పోలవరం ముంపుపై శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని జలశక్తి శాఖ తెలిపింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య లేదని వెల్లడించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  బ్యాక్ వాటర్‌పై మరోసారి సర్వే చేయించాలన్న తెలంగాణ వాదనను కేంద్రం తోసిపుచ్చింది. పోలవరం బ్యాక్ వాటర్‌పై ఇప్పటికే అధ్యయనం చేశామని పేర్కొంది. ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలవి అపోహలు మాత్రమే అని స్పష్టం చేసింది. 2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని జలశక్తి శాఖ(JalShakti)  తెలిపింది. భద్రాచలానికి(Bhadrachalam) ఎలాంటి ముంపు సమస్య లేదని వెల్లడించింది. పోలవరం పూర్తయ్యాక కూడా 3 రాష్ట్రాల్లోముంపు ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణంతో ముంపు సమస్యలపై తెలంగాణ సహ ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి.

  ఈ విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయమై చొరవ తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.ఈ సూచన మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వం.. పోలవరం బ్యాక్ వాటర్ పై మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో డిమాండ్ చేసింది.

  బ్యాక్ వాటర్ కారణంగా భద్రచాలం సహా పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది జూలైలో గోదావరి వరదను కూడా తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ముంపు నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ కోరింది. రక్షణ కోసం నిర్మించే గోడలకు అయ్యే ఖర్చును పోలవరం అథారిటీ భరించాలని తెలంగాణ కోరింది.

  KCR Yadadri: రేపు యాదాద్రికి కేసీఆర్ .. ఆయన వెంట నలుగురు దాతలు

  YS Sharmila: షర్మిల ప్లాన్ సగం మాత్రమే సక్సెస్.. మిగతా సగం వర్కవుట్ కావడం లేదా ?

  సమావేశంలో అనేక అంశాలపై నాలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అక్టోబర్ 7న 4 రాష్ట్రాల ఈఎన్సీలతో మరోసారి కేంద్ర జలశక్తిశాఖ భేటీ కావాలని నిర్ణయించింది. బ్యాక్ వాటర్ సర్వేకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సమావేశం నిర్వహించనున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Polavaram, Telangana

  ఉత్తమ కథలు