Warangal: వేద పాఠశాలలో దారుణం.. ఏం తప్పు చేశారని ఇంతలా శిక్షించారు..?

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేద పాఠశాలలో విద్యార్థులను దారుణంగా శిక్షించిన ఘటన కలకలం రేపుతోంది.

  • Share this:
    తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేద పాఠశాలలో విద్యార్థులను దారుణంగా శిక్షించిన ఘటన కలకలం రేపుతోంది. వివరాలు.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మూడేళ్లుగా వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ వేద పాఠశాలలో 8 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారు. అయితే ప్రస్తుతం కరోనా కాలంలో విద్యా సంస్థలు మూతపడినప్పటికీ.. వేద పాఠశాలలో మాత్రం తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న మైనర్ బాలురను కఠినంగా శిక్షించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    8 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న బాలురను వేద పాఠశాలలో కఠినంగా శిక్షించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు స్థానికుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక, ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను నిర్వహకులు.. కర్రలతో విచక్షణ రహితంగా కొట్టినట్టుగా తెలుస్తోంది. దెబ్బలకు విద్యార్థులకు వాతలు వచ్చాయి. దీంతో వారి తల్లిదండ్రులు ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు వారు ఆరోపించారు.

    ఇవి కూడా చదవండి: Telangana TDP President: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు.. ప్ర‌క‌టించిన చంద్రబాబు నాయుడు

    Medak: ఫామ్ హౌస్‌లో న‌యా దందా.. అర్ధ‌రాత్రి పోలీసులు దాడి చేయ‌డంతో..


    పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. ట్రస్ట్ సభ్యులు పట్టించుకోకపోవడంతో తాము ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పిల్లలను విచక్షణ రహితంగా శిక్షించే ఇలాంటి పాఠశాలను కొనసాగించే అర్హత లేదన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: