Home /News /telangana /

STUDENTS ATTENDING ONLINE CLASSES ARE AWARE OF CYBER FRAUD IN MANCHIRYALA DISTRICT SNR ADB

Cyber ​​Congress : ఆన్‌లైన్‌ క్లాసులు వినే స్టూడెంట్స్‌కి సైబర్‌ నేరాలపై అవగాహన..పోలీస్‌శాఖ ఐడియాతో సత్ఫలితాలు

(Cyber ​​Congress)

(Cyber ​​Congress)

Cyber ​​Congress: ఆన్‌లైన్‌ తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా... అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీసు శాఖ. దీని వల్ల స్టూడెంట్స్‌కి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mancherial, India
    (K.Lenin,News18,Adilabad)
    సెల్ ఫోన్లు(Cell phones), ఇంటర్నెట్(Internet), అన్ లైన్(Online)వేదికల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. విద్యార్థులకు ఆన్లైన్ చదువులు(Online classes)అనివార్యమయ్యాయి. చదువు మాత్రమే కాదు వైద్యం, అమ్మకాలు, కొనుగోళ్లు, ఉద్యోగాలు, లావాదేవీలు ఇలా అన్నీ ఆన్‌లైన్‌ వేదికగా కొనసాగుతున్నాయి. సెల్ఫోన్లు, అంతర్జాలం వినియోగం తప్పనిసరైంది. ఇదే సమయంలో ఇదే సమయంలో సైబర్ నేరాల (Cyber ​​crimes) సంఖ్య కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలు (Women) పిల్లలే (Children), లక్ష్యంగా సైబర్ మోసాలు, వేధింపులు కూడా అధికమవుతున్నాయి.

    Cyber ​​fraud : న్యాయవాదికి న్యూడ్ కాల్ చేసిన అమ్మాయిలు .. తర్వాత వీడియో చూసి షాక్



    స్టూడెంట్స్‌కి ఎంతో మేలు..
    రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్‌ మోసాల బారినపడకుండా ఉండేందుకు సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీసు శాఖ. ఆన్‌లైన్‌ తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా... అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు మహిళా భద్రతా విభాగం, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, ఇంచార్జి డిసిపి అఖిల్ మహాజన్ హజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.



    అవగాహన , అప్రమత్తం..
    టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాలను గుర్తించి స్నేహితులను, బంధువులను, ఇరుగుపొరుగు వారిని చైతన్య వంతులను చేయాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి పై ఉందన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. విద్యార్థులు సైబర్ కాంగ్రెస్ పై అవగాహన పెంచుకొని ఉత్తమ సైబర్ అంబాసిడర్లుగా మారాలని విద్యార్థులకు సూచించారు. సెల్ఫోన్లు, ఇంటర్ నెట్, ఆన్లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు మంచిర్యాల ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్. మహిళలు, పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయన్నారు.

    సైబర్‌ నేరాలకు చెక్..
    సైబర్ కాంగ్రెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలను నియంత్రించాలని... విద్యా వ్యవస్థలో ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావిస్తోందని వివరించారు. తల్లిదండ్రులు, ఆడపిల్లలు, మహిళలు, యువతకు వీటిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సైబర్ కాంగ్రెస్‌లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని సూచించారు. ఉపాధ్యాయులు కూడా సైబర్ నేరాల నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు కలెక్టర్,ఇన్‌చార్జ్‌ డీసీపీ.
    ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన తప్పనిసరి అని అన్నారు.

    Jaggareddy | Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన అదే .. నవంబర్‌ 5న ముహుర్తం ఫిక్స్



    టాలెంట్ స్టూడెంట్స్‌కి గుర్తింపు..
    సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో సైబర్ కాంగ్రెస్ అంబాసిడర్స్ గా ఎన్నికైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిని భీమిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె శ్రీయ, రెండవ బహుమతిని పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విదార్థిని కే మహేశ్వరి, మూడవ బహుమతిని బెల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మీనాక్షి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డితో పాటు మరికొందరు పోలీస్‌, విద్యాశాఖ అధికారులు పాఠశాలల విద్యార్థులు, షీ టీమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: CYBER CRIME, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు