హోమ్ /వార్తలు /తెలంగాణ /

Basara IIIT : ఒక్క స్టూడెంట్ మరణంతో రణరంగంగా మారిన బాసర ట్రిపుల్ ఐటీ

Basara IIIT : ఒక్క స్టూడెంట్ మరణంతో రణరంగంగా మారిన బాసర ట్రిపుల్ ఐటీ

basara student suicide

basara student suicide

Basara iiit: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ రూమ్‌లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడం కలకలం రేపింది.కారణాలు చెప్పమంటూ మిగిలిన స్టూడెంట్స్‌ ఆందోళనకు దిగారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nirmal, India

నిర్మల్(Nirmal)జిల్లా బాసర(Basara)లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్(Engineering student)రూమ్‌లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడం కలకలం రేపింది. అధికారులు స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదని ..కనీసం చనిపోయిన గంట వరకు అంబులెన్స్ (Ambulance) కోసం ఫోన్‌(Phone)కూడా చేయకపోవడంతో మిగిలిన విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం(Postmortem)నిమిత్తం తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీస్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. సురేష్ (Suresh)మృతి విషయంలో ట్రిపుల్‌ ఐటీ కాలేజీ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. నిత్యం ఏదో సమస్యలతో విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతున్న ట్రిపుల్‌ ఐటీలో సంపూర్ణంగా సమస్యల ప్రక్షాళన జరిగేదెప్పుడని స్టూడెంట్స్, విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


BJP|Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు .. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీమళ్లీ టెన్షన్ వాతావరణం..
బాసర ట్రిపుల్‌ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. క్యాంపస్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న సురేష్ స్టూడెంట్ హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన స్టూడెంట్‌ స్వస్తలం నిజామాబాద్‌ జిల్లా. సురేష్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై పూర్తి వివరాలు రాలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై మిగిలిన స్టూడెంట్స్‌ కూడా తెలియని చెబుతున్నారు. అయితే సురేష్‌ సూసైడ్ చేసుకుంటే కనీసం ట్రిపుల్‌ ఐటీ అధికారులు పట్టించుకోకపోవడంపై క్యాంపస్‌లోని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు.


స్టూడెంట్స్‌ డిమాండ్..

సురేష్‌ ఎలా చనిపోయాడనే విషయాన్ని ధృవీకరించకపోవడాన్ని తప్పుపడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విద్యార్ధులు సురేష్‌ చనిపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి గంట వరకు అంబులెన్స్ కోసం ఫోన్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.


Crime news : భర్త మర్డర్‌కి భార్యే స్కెచ్ .. 7సార్లు ప్రయత్నం చేసి సక్సైస్ అయింది ..ఎందుకు చేసిందంటేపోస్ట్‌మార్టం తర్వాతే వివరాలు..

సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్‌కి వస్తే పోలీసు వాహనాల్ని స్టూడెంట్స్ ధ్వంసం చేశారు. స్టూడెంట్ సురేష్‌ డెడ్‌బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా స్టూడెంట్స్‌ అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికిలోని మార్చురికి తరలించారు. పోస్ట్ మార్టం ముగిసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని వైద్యులు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా బాసరలోని ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో సమస్యలు పరిష్కరించమంటూ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం సైతం చర్చలు జరిపినప్పటికి క్యాంపస్‌లో పేరు మార్మోగుతూనే ఉంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Basara IIIT, Telangana News

ఉత్తమ కథలు