కేయూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్

సెమిస్టర్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని.. తమపై దౌర్జన్యానికి దిగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు విడిమాండ్ చేస్తున్నాయి.

news18-telugu
Updated: November 27, 2019, 5:18 PM IST
కేయూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై  పోలీసుల లాఠీచార్జ్
కాకతీయ యూనివర్సిటీ
  • Share this:
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ(కేయూ)లో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో సెమిస్టర్ పరీక్షలకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళనకు దిగింది. సిలబస్ పూర్తి కాకముందే సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 రోజుల షెడ్యూల్‌ క్లాసులు పూర్తిగా జరగకముందే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో పరీక్షలను వాయిదా వేయాలంటూ కేయూ రిజిస్ట్రార్ చాంబర్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

గంటల తరబడి బైఠాయించినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో.. రిజిస్ట్రార్ చాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. దాంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పలువురిపై లాఠీచార్జ్ చేశారు. ఐతే పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే విద్యార్థులపై దాడికి పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సెమిస్టర్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని.. తమపై దౌర్జన్యానికి దిగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>