సిద్ధిపేటలో విషాదం.. ఊయలే.. ఉరితాడుగా మారి విద్యార్థిని మ‌ృతి

సరదాగా ఊగేందుకు ఇంట్లో దూలానికి కట్టిన ఊయల ప్రమాదవశాత్తు మెడకు బిగుసుకోవడంతో విద్యార్థిని మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: March 29, 2020, 1:27 PM IST
సిద్ధిపేటలో విషాదం.. ఊయలే.. ఉరితాడుగా మారి విద్యార్థిని మ‌ృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సరదాగా ఆడుకునేందుకు ఇంట్లో దూలానికి కట్టిన ఊయలే.. ఉరితాడుగా మారి విద్యార్థి మృతిచెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పబ్బతి నర్సయ్య, సరోజన దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు. దంపతులిద్దరూ ఊరిలో దొరికిన కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పెద్ద కుమార్తె అయిన దివ్య(14) 9వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో పాఠశాల లేక ఇంట్లోనే ఉంటున్నారు.

అయితే సరదాగా ఆడుకునేందుకు వారింట్లో దూలానికి చీరతో ఊయల కట్టారు. ఆ ఊయలలో ఆడుకుంటుండగా ఊయలకు కట్టిన చీర, దివ్య మెడలో వేసుకున్న చున్నీ రెండు మెడకు బిగుసుకుపోవడంతో ఊపిరాడక చనిపోయింది. తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యింది. అప్పటికి తల్లి సరోజన పలుమార్లు దివ్యను పిలిచింది. అయినా పలకకపోవడంతో ఆడుకుంటుందేమోనని భావించింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. దివ్య తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading