డబ్బులివ్వలేదని పరీక్షల్లో ఫెయిల్ చేశాడు.. HRCకి విద్యార్థి ఫిర్యాదు

తమ ఆన్షర్ బుక్స్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుందని మానవ హక్కులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నాడు శ్రావణ్. అదే పేపర్‌ని రీవాల్యుయేషన్ చేస్తే తాము ఖచ్చితంగా పాసవుతామని తెలిపాడు.


Updated: January 29, 2020, 10:31 PM IST
డబ్బులివ్వలేదని పరీక్షల్లో ఫెయిల్ చేశాడు.. HRCకి విద్యార్థి ఫిర్యాదు
మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన శ్రావణ్
  • Share this:
డబ్బులు ఇవ్వనందుకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో కాలేజీ ప్రిన్సిపల్ ఫెయిల్ చేశాడని ఓ విద్యార్థి ఆరోపించాడు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన శ్రావణ్ అనే యువకుడు 2019లో శ్రీమణికంఠ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశాడు. ఐతే థియరీ పరీక్షల్లో పాసైనప్పటికీ ప్రాక్టికల్స్‌లో మాత్రం ఫెయిలయ్యాడు. ప్రాక్టికల్ పరీక్షలు షాద్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాశాడు. ఐతే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ రాహూప్ రూ.5వేలు డబ్బులు డిమాండ్ చేశాడని శ్రావణ్ ఆరోపించాడు.

షాద్‌నగర్ కాలేజీ ప్రిన్సిపల్ మణికంఠ కాలేజీని డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.5వేలు లేదా ఇన్వర్టర్ ఇప్పించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ పరీక్షలు మొదలయ్యే సమయానికి మా కాలేజీ యాజమాన్యం డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రిన్సిపాల్ కక్షగట్టాడు. అందుకు ప్రతీకారంగా ఎలక్ట్రికల్ మెషీన్స్ ప్రాక్టికల్స్ పరీక్ష రాసిన ఇద్దరు విద్యార్థులను ఫెయిల్ చేశారు. మేం పరీక్ష బాగా రాసినప్పటికీ ఎగ్జామినర్‌పై ఒత్తిడి తెచ్చి ఫెయిల్ చేయించారు. ప్రైవేట్ కాలేజీ వాళ్లు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో మా జీవితాలను నాశనం చేశారు.
శ్రావణ్


తమ ఆన్షర్ బుక్స్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుందని మానవ హక్కులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నాడు శ్రావణ్. అదే పేపర్‌ని రీవాల్యుయేషన్ చేస్తే తాము ఖచ్చితంగా పాసవుతామని తెలిపాడు. తమ హక్కులకు భంగం కలిగించిన షాద్‌నగర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రాహూప్‌పై చర్యలు తీసుకొని.. తనకు న్యాయ చేయాలని విజ్ఞప్తి చేశాడు.

First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు