హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: గ్రామ సింహాల దాడిలో 14మందికి గాయాలు .. ముగ్గురికి రిమ్స్‌లో ట్రీట్‌మెంట్

OMG: గ్రామ సింహాల దాడిలో 14మందికి గాయాలు .. ముగ్గురికి రిమ్స్‌లో ట్రీట్‌మెంట్

stray dogs attack

stray dogs attack

OMG: ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ సింహాలు స్వైరవిహారం చేశాయి.ఇంద్రవెల్లిలో వీధి కుక్కల దాడిలో 14మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయలవడంతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad, India

(K.Lenin,News18,Adilabad)

తెలంగాణ(Telangana)లో కుక్కల దాడులు ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిత్యం ఏదో ఓ చోట జనంపై దాడి పదుల సంఖ్యలో ఆసుపత్రిపాలు చేస్తున్నాయి వీధి కుక్కలు. తాజాగా ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో గ్రామ సింహాలు స్వైరవిహారం చేశాయి. ఇంద్రవెల్లిలో వీధి కుక్కలు (Stray Dogs)బీభత్సం సృష్టించాయి. శనివారం(Saturday) సాయంత్రం ఒకే సమయంలో 14మందిపై దాడి చేశాయి. వీధి కుక్కల దాడిలో గాయపడిన వారికి (Indravelli)ఇంద్రవెల్లి()లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ముగ్గురికి తీవ్రగాయాలవడంతో వారికి మెరుగైన చికిత్స అందించేందుక ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

పిచ్చి కుక్కల స్వైర విహారం..

తెలంగాణ వ్యాప్తంగా పిచ్చి కుక్కలు, వీధి కుక్కల బెడద బాగా పెరిగింది. ఎటు నుంచి వచ్చి పిక్క లాగేస్తాయో అనే భయం ప్రతి ఒక్కరిలో నెలకొంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో రోడ్లపై తిరిగే పిచ్చికుక్కలు కరిచి 14మంది గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఇంద్రవెల్లిలోని జనంపై విరుచుకపడ్డాయి. చిన్న పిల్లలు వృద్ధులతో పాటు మొత్తం 14 మంది గాయపడ్డారు. ప్రస్తుతం కుక్కల దాడిలో గాయపడిన వాళ్లలో 11మంది ఇంద్రవెల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒకేసారి 14మందిపై దాడి..

14మందిలో ముగ్గురికి తీవ్రంగా గాయలవడంతో వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. కుక్కల దాడితో ఇంద్రవెల్లితో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పనులపై రోడ్లపైకి రావాలంటనే వణికిపోతున్నారు. మరోవైపు కుక్కల స్వైర విహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుందటంతో ఇంద్రవెల్లి పట్టణ యువకులు కర్రలు పట్టుకొని కుక్కను వెంబడించి కుక్కను చంపేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని..గ్రామస్తుల్ని కుక్క కాట్లకు బలికాకుండా కాపాడాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇంద్రవెల్లిలో కుక్కల వల్ల ప్రజలు బయటకు వెళ్లెందుకు భయాందోళనకు గురవుతున్నారు.

Telangana: అన్నీ న్యాయస్థానాలను కదిలించిన ఒకే ఒక్క ఆర్టీఐ దరఖాస్తు ..ఏం సమాచారం కోరాడో తెలుసా

నాలుగు రోజుల క్రితమే..

నిజామాబాద్ జిల్లాలో గ్రామ సింహాలు గర్జిస్తున్నాయి. ఊరిలో జనంపై పడి విచ్చలవిడిగా దాడి చేస్తూ జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మెండోరా మండల కేంద్రంలో వీధి కుక్కలు జనంపై దాడి చేశాయి. గంట వ్యవధిలో 13 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఇద్దరిని ఛాతీపై, మరో ఇద్దరికి ఏకంగా ముఖంపై కరిచాయి. ఇద్ద‌రిని కాళ్లు పట్టుకొని పీకగా.. మ‌రో నాలుగురికి చేతిపై దాడి చేశాయి మాయదారి కుక్కలు. కుక్కల దాడిలో గాయపడిన వాళ్లంతా వెంటనే మెండోరా మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ కు తరలించారు. డాక్టర్ కుక్కల కాటు గురైన వారిని పరిశీలించారు. 8 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలిపారు. మరో ఐదుగురికి స్వల్పంగా గాయపడ్డట్లు చెప్పారు. కుక్కల దాడిలో గాయపడిన వారిలో ఇద్దరికి సర్జరీ కూడా చేయాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు.

First published:

Tags: Adilabad, Stray dogs attack, Telangana News

ఉత్తమ కథలు