Home /News /telangana /

STRATS NEW LIQUOR POLICY IN TELANGANA SYNDICATES ARE REDAY TO SELL FOR HIGH RATES VRY KMM

Khammam : కొత్త లిక్కర్‌ పాలసీ షురూ.. గ్రామాల్లో మొదలైన సిండికెట్‌ దందా..

liqour shop file photo

liqour shop file photo

Khammam : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుండి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. దీంతో షాపులు దక్కించుకున్న వారు సిండికేట్‌లా మారారు.. ( new liquor policy in Telangana ) దీంతో గ్రామాల్లో బెల్టు షాపులతో పాటు ..రేట్లు పెంచి అమ్మేందుకు సర్ధబాట్లు చేస్తుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

  తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుండి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటికే జిల్లాల వారీగా మద్యం షాపుల కేటాయింపును లాటరీ పద్దతి ద్వారా పూర్తి చేశారు.( new liquor policy in Telangana ) ఒక మోస్తరు అమ్మకాలున్న ప్రతి ఊరికి ఒక మద్యం షాపును కేటాయించడం ద్వారా ప్రభుత్వం ఈసారి ఆదాయాన్ని మూట గట్టుకునేలా వెసులుబాటు కల్పించుకుంది. కేవలం పదివేల జనాభా ఉన్న మేజర్‌ గ్రామ పంచాయతీలలో కూడా కొత్త షాపును కేటాయించడం ద్వారా గుడుంబాను అరికట్టడానికి ప్రభుత్వం పూనుకుందని చెప్పవచ్చు.

  గతంలో ఇలాంటి ప్రతి గ్రామానికి, చిన్న పల్లెలకు, తండాలకు బెల్ట్‌ షాపుల ద్వారా మాత్రమే మద్యం అందుబాటులో ఉండేది. దాదాపు ప్రతి చిల్లర దుకాణం, డబ్బా కొట్లలో సైతం మద్యం అందుబాటులో ఉండేదంటే బెల్ట్‌ షాపుల్లో ఏ స్థాయిలో వ్యాపారం నడిచిందో అర్థం చేసుకోవచ్చు.( new liquor policy in Telangana ) తమ పరిధిలోని బెల్ట్‌ షాపు నిర్వాహకులు వేరే ప్రాంతంలోని మద్యం దుకాణం నుంచి సరకు తెచ్చుకుంటున్నారంటూ ఎక్సైజ్‌ పోలీసులుతో దాడులు చేయించడం, కేసులు పెట్టించిన దాఖలాలు కూడా గతంలో అనేకం.

  Guntur: వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలు.. ఆన్ లైన్లో పేమెంట్స్.. హైటెక్ దందా ఆటకట్టించిన పోలీసులు


  ఈ పరిస్థితుల్లో కొత్త మద్యం పాలసీ అమల్లోకొస్తున్నా.. క్షేత్ర స్థాయిలో బెల్ట్‌ షాపులే ఆదాయానికి మొదటి మెట్టు అనే భావన సర్వత్రా నెలకొంది.జిల్లాలో గతానికి మించి 122 దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. కేవలం లైసెన్స్‌ దరఖాస్తుల రూపంలోనే వందల కోట్లలో ఫీజు వసూలైంది. ( new liquor policy in Telangana )ఇప్పటికే దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉన్న వాళ్లు, సిండికేట్‌గా ఏర్పాటై దందాను నడపడానికి సిద్దం అవుతున్నారు. ఒక్కో సిండికేట్‌ అరవై నుంచి వంద అప్లికేషన్లు దాకా పెట్టిన దాఖలా ఉంది. ఇలా 120 దరఖాస్తులు పెట్టిన ఒక సిండికేట్‌కు మూడు షాపులు, 62 దరఖాస్తులు పెట్టిన రెండు సిండికేట్ల‌కు రెండేసి చొప్పున దుకాణాలు లాటరీ ద్వారా వచ్చినట్టు తెలుస్తోంది.

  ఇలా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు ఫీజు చెల్లించినా, ఒక్క షాపు కూడా దక్కని వాళ్లు వచ్చిన వారి నుంచి కొనుగోళ్లకు బేరసారాలు నడిపారు. ఏళ్ల తరబడి ఈ వ్యాపారంలో ఉండి, ఒక్క షాపు కూడా దక్కని వాళ్లు కోటిన్నర రెండు కోట్లు కూడా వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. ( new liquor policy in Telangana )ఈసారి కొత్తగా షాపుల కేటాయింపులో రిజర్వేషన్‌ అమలు చేయడంతో లాటరీలో షాపులు దక్కిన వారికి పెట్టుబడి, అనుభవం, వ్యాపార నైపుణ్యాలు అవసరం అయ్యాయి. దీంతో ఇప్పటికే రంగంలో ఉన్నవారికి ఛాన్స్‌ వచ్చింది. షాపు వచ్చిన వారిని అప్రోచ్‌ కావడం, గుడ్‌విల్‌ ఆఫర్‌ చేసి పెట్టుబడి లేకుండా వాటా ఇవ్వడం లాంటి వ్యాపార ఎత్తుగడలతో పాతవాళ్లు మళ్లీ కొనసాగే అవకాశం సృష్టించుకున్నారు.

  Etela Rajendar: ఈటల రాజేందర్ మాస్టర్ ప్లాన్.. అదే జరిగితే బీజేపీలో లెక్కలు మారతాయా ?


  వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని లాటరీలో షాపులు పొందిన వాళ్లు ఎంతో కొంత ఇన్స్టంట్‌ ప్రాఫిట్‌లకు తమ లైసెన్స్‌లను అమ్మేశారు. కొందరు గుడ్‌విల్‌ తీసుకుని వాటాలు అట్టిపెట్టుకున్నారు. ఇక ఈ రోజు నుంచి కొత్త పద్దతిలో అమ్మకాలు షురూ అయ్యాయి.( new liquor policy in Telangana ) ఖర్చు అయిన మేరకు పూడ్చుకోవాలన్నా.. లాభాలు తీయాలన్నా ఇక దందా సాగాల్సిందే. దీనికోసం ఎంఆర్‌పీ కన్నా కాస్తైనా అదనంగా అమ్మాల్సిందే. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్సైజ్‌, పోలీసులను మేనేజ్‌ చేసుకోవాలి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా ఉండాలన్నా అందరూ సిండికేట్‌ కావాల్సిందే.

  అప్పుడే ఏదైనా కాస్త లాభం పొందే వీలుంటుందన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మద్యం అమ్మకాలు జరిపితే తమకు మిగిలేది ఏమీ ఉండదని, అసలు ఈ వ్యాపారం చేయలేమని, ఇంకో మాటలో చెప్పాలంటే ఇలాంటి వ్యాపారంలోకి అడుగుపెట్టడమే దండగన్న భావన ఉంది. ఏదో రకంగా నిబంధనల ఉల్లంఘన జరక్కుండా లాభాలు తీయలేమన్న బలమైన అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇక మద్యాన్ని ఎంఆర్‌పీకే అమ్మాలి అన్నది మాత్రం చెప్పుకోడానికే అన్న అభిప్రాయం కూడా ఉంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Liquor policy, Telangana

  తదుపరి వార్తలు