(Katta Lenin, News 18, Adilabad)
ఎండా వానా (Rain) దోబూచులాడుతున్నట్టున్నాయి. ఒకపక్క సూర్యుడు తన ప్రతాపంతో చెమటలు పట్టిస్తుంటే, అంతలోనే వాన వచ్చి ఊరటనిస్తున్నది. గడిచిన వారం రోజుల నుండి ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న అకాల వర్షం (Rain) రైతులకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చిపోయినా కొంత వాతావరణం (Weather) చల్లబడిపోయింది. అంతలోనే భానుడికి (Sun) కన్నుకుట్టిందేమో మళ్ళీ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. రికార్దు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత (temperature) నమోదైంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు (Changes in Weather) చోటుచేసుకున్నాయి. అప్పటి వరకు భానుడు ఉగ్రరూపం దాల్చి దడపుట్టిస్తే ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం చల్లబడిపోయింది. గడిచిన వారం రోజుల నుండి సూర్యుడి ప్రతాపానికి చమటలు కక్కిన ప్రజలకు చల్లబడ్డ (Cool weather)వాతావరణం కొంత ఊరటనిచ్చింది.
ఉదయ 10 గంటలకే.. ఎండ తీవ్ర రూపం
నిర్మల్ (Nirmal) జిల్లాలోని ఖానాపూర్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం (Rain) కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల వర్షం కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండకాలం (Summer) ప్రారంభం నుండే సూర్యుడు తన ప్రతాపం ప్రదర్శిస్తున్నాడు. ఉదయ పది గంటలు దాటిందో లేదో ఎండ తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో జిల్లా ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే వేసవి ప్రతాపం ఇలా ఉంటే రానున్న మే నెలలో ఎండల తీవ్రత ఇంకెంత ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో (Telangana) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రదేశాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలు కూడా ఉంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సగటు ఉష్ణొగ్రత రెండు డిగ్రీలకు పైనే పెరిగింది. అత్యథికంగా జిల్లాలోని జైనథ్ మండలం లో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత కొన్ని రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో (High temperature) బయటకు వెళ్ళేందుకు జనం జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఊరట లభించినట్లైంది.
మరో మూడు రోజులపాటు (Next three days) వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే అకాల వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేసిపోయింది. మళ్ళీ ఎండలు అందుకున్నాయో లేదో మళ్ళీ వాతావరణం చల్లబడింది. ఎండా కాలంలో వానలు పడటమేనని జిల్లాలోని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.