Bandi sanjay : కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఏమిటో చూపించిన మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి.అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొనియాడారు. ఆయన జయంతి సంధర్భంగా నిర్వహంచిన సెమినార్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి , 50 ఏళ్లు ఎంపీగా, 5 సార్లు జాతీయ అధ్యక్షులుగా కొనసాగిన నేత వాజ్ పేయి అన్నారు.. డబ్బులతోనే రాజకీయాలను శాసిస్తూ పార్టీలు మారుతున్న ఈ కాలంలో కార్యకర్తలను, సిద్దాంతాలను నమ్ముకుని దేశానికి సుపరిపాలన అందించిన మహానేత వాజ్ పేయి రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం అని చెప్పారు..ఇక అద్వానీ, వాజ్ పేయి అత్యంత స్నేహపూర్వక సంబంధాలు అందరికీ ఆదర్శం.ఈ సంధర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి , 50 ఏళ్లు ఎంపీగా, 5 సార్లు జాతీయ అధ్యక్షులుగా కొనసాగిన నేత వాజ్ పేయి అన్నారు.. డబ్బులతోనే రాజకీయాలను శాసిస్తూ పార్టీలు మారుతున్న ఈ కాలంలో కార్యకర్తలను, సిద్దాంతాలను నమ్ముకుని దేశానికి సుపరిపాలన అందించిన మహానేత వాజ్ పేయి రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం అని చెప్పారు..ఇక అద్వానీ, వాజ్ పేయి అత్యంత స్నేహపూర్వక సంబంధాలు అందరికీ ఆదర్శం. గులాబీ చెట్టుకు ముళ్లు, పూల మాదిరిగా వాజ్ పేయి-అద్వానీ స్నేహ బంధాలుండేవని గుర్తు చేశారు...
కార్గిల్ యుద్దంలో విజయం సాధించి పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టిన ఘనత వాజ్పేయికి దక్కిందని చెప్పారు. దుష్ట కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం బీజేపీపై అనేక విమర్శలు చేసినప్పటికీ... నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటామని ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు నెరిపిన నాయకుడు అంటూ కొనియాడారు.
మరోవైపు..స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని హైదరాబాద్కు ఆహ్వానించడం పై మండిపడ్డారు..దుర్గమ్మను , సీతమ్మ , శ్రీరామ చంద్రుడ్ని అవమానించిన మూర్ఖుడు స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ అంటూ దుయ్యబట్టారు. అలాంటీ మూర్ఖుడిని కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. భయంకరమైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్ ముందుగా నాస్తికుడైన కొడుకు కేటీఆర్ ను కట్టడి చేయాలని సూచించారు. మరోవైపు కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులేనంటూ మండిపడ్డారు. యువ మోర్చా నేతలు అలాంటి మునావర్ ఫారూఖీని తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని పిలునిచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.