Home /News /telangana /

STATUE OF MAHATMA GANDHI ERECTED 72 YEARS AGO IS STILL SAFE IN DUBBAKA OF SIDDIPET DISTRICT SNR MDK

Telangana : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు..అక్కడ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలంటే..

Mahatma Gandhi statue

Mahatma Gandhi statue

Gandhi statue: స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు. కాని అక్కడ మహాత్ముడు వెలసి 72ఏళ్లు పూర్తి కావస్తోంది. జాతిపితగా భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న మహాత్ముడు..ఆ పట్టణంలో కూడా 7దశాబ్ధాలకుపైగా చెక్కు చెదరకుండా అందరికి దర్శనమిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India
    (K.Veeranna,News18,Medak)
    స్వాతంత్య్రం ఉద్యమం(Independence Movement)ఎంత చెప్పుకున్నా తరగనిది. దేశానికి బానిక సంకెళ్ల నుంచి విముక్తి కోసం స్వాతంత్య్రం తేవడంలో ముందుండి నడిపించిన మహాత్మగాంధీ(Mahatma Gandhi)కి అంతే గొప్ప పేరుంది. అయితే అక్కడ మాత్రం స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత నెలకోల్పబడిన విగ్రహాని (Statue)కి ప్రత్యేకతమైన చరిత్ర ఉంది. 75ఏళ్ల భారత స్వాతంత్య్రం దినోత్సవ వజ్రోత్సవాల వేడుకలో ఇప్పుడు ఆ విగ్రహం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ(Telangana)లోని సిద్దిపేట(Siddipet)జిల్లాలో ఆ చారిత్రక విగ్రహం చెక్కు చెదరకుండా ఉంది.

    PV Sindhu | CM KCR : కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పీవి సింధుకు గోల్డ్ మెడల్ .. అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్



    72ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహం..
    భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకు స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కాని సిద్దిపేట జిల్లా దుబ్బాక చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహాన్ని మాత్రం స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకే మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రెండు సార్లు జెండా పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే మహాత్ముడి విగ్రహం ప్రతిష్టించి అక్షరాల 72సంవత్సరాలు.



    చెక్కు చెదరని జాతిపిత విగ్రహం..
    స్వాతంత్య్రం సాధించిన తర్వాత నుంచి నేటి వరకు ప్రతి జెండా పండుగను మహాత్ముడి విగ్రహం దగ్గర ఎగురవేస్తూ వస్తున్నారు. దీంతో ఆ రెండు రోజుల్లో ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. దుబ్బాక చౌరస్తాలో ఉన్న మహాత్మగాంధీ విగ్రహానికి 72ఏళ్ల క్రితం ఏర్పాటు చేస్తే ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఆ నాటి యువకులు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాలుగేళ్లకు దుర్వాస యువజన మండలి ఏర్పాటు చేసి పట్టణ నడి మధ్యలో ఈ విగ్రహాన్ని నెల కొల్పారు. ఆ తర్వాత దుబ్బాకలో ఈ గాంధీ విగ్రహం ప్రతిష్టించిన ప్రాంతం గాంధీ చౌరస్తాగా మారి చాలా ఫేమస్ అయింది.

    ప్రతి ఒక్కరికి స్పూర్తి..
    స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే సందర్భంగా ఈ విగ్రహం దగ్గరే జాతీయ పతాకం ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. తెలంగాణ ససీఎం కేసీఆర్ దుబ్బాకలో చదువుకునే రోజుల్లో ఈ విగ్రహంతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. పాఠశాలకు వెళ్లే రోజుల్లో ఈ గాంధీ విగ్రహం సమీపంలోనే అద్దె ఇంట్లో ఉండేవారు. ప్రతీరోజు స్నేహితులతో కలిసి అదే చౌరస్తాలో ఆటలు ఆడుకునేవారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు కేసీఆర్‌తో పాటు పాఠశాల విద్యార్ధులంతా ఆ కార్యక్రమాల్లో పాల్గొ నేవారు.

    Telangana : కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్న పాలమూరు జిల్లా ప్రజలు.. వాళ్లతో ఆసుపత్రులు ఫుల్



    మూడేళ్లకే విగ్రహం ఏర్పాటు..
    ఈ మహాత్ముడి విగ్రహాన్ని దుబ్బాక మాజీ సర్పంచ్ స్వర్గీయ శ్రీరాం రాజయ్య తన స్నేహితులతో కలిసి దుర్వాస యువజన మండలి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. నేను ఇప్పటికీ ప్రతి ఏటా ఇక్కడే జరిగే ఉత్సవాల్లో పాల్గొంటానని కేసీఆర్ బాల్యమిత్రుడు, రాజయ్య తనయుడు శ్రీరాం తిలక్ ,చందర్ చెబుతున్నారు.ఇంతటి విశేష చరిత్ర కలిగిన జాతిపిత విగ్రహాన్ని ఇదే విధంగా పదిలంగా మరో పది కాలాల పాటు భద్రంగా చూసుకోవాలని..భావితరాలకు స్వాతంత్ర్య ఉద్యమం విలువ, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం తెలియపరచాలని స్థానికులు కోరుతున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Independence Day, Mahatma Gandhi, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు