Home /News /telangana /

STATE TRIBAL WELFARE MINISTER SATYAVATI RATHORE HAS SAID THAT THE GOVERNMENT IS OFFICIALLY ORGANIZING TRIBAL FAIRS AND CELEBRATIONS AND RELEASING FUNDS FOR THEM ADB PRV

Telangana: "గిరిజన వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు అందజేస్తుంది ”: మంత్రులు సత్యవతి, ఇంద్రకరణ్​ రెడ్డి

ఆదిలాబాద్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్​ రెడ్డి, సత్యవతి రాథోడ్​

ఆదిలాబాద్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్​ రెడ్డి, సత్యవతి రాథోడ్​

రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy)తో కలిసి సత్యవతి రాథోడ్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. తొలుత ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని గిరిజనుల ఇలవెల్పు కేస్లాపూర్ లోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు.

ఇంకా చదవండి ...
    గిరిజనుల (Tribal) ఇలవేల్పులను కొలుస్తూ వారు జరుపుకునే జాతరలు, వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ వాటికి ప్రభుత్వం ద్వారా నిధుల విడుదల (Releasing Funds) చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (State Tribal Welfare Minister Satyavathi Rathore) వెల్లండించారు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy)తో కలిసి సత్యవతి రాథోడ్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. తొలుత ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని గిరిజనుల ఇలవెల్పు కేస్లాపూర్ లోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్మాణం పనులను మంత్రులిద్దరు అధికారులతో కలిసి పరిశీలించారు.

    జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంకిత్ వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజనుల (Tribals) జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు వారు ఆరాధించే ఇలవేల్పులైన సమ్మక్క సారలమ్మ, నాగోబా జాతరలతోపాటు సేవాలాల్ మహారాజ్ జయంతి తదితర వేడుకలను ప్రభుత్వ నిధులతో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.

    జాతరకు రూ. 350 కోట్లు..

    ముఖ్యమంత్రి ఆదివాసి గిరిజనులకు, లంబాడీలకు (To the aboriginal tribes, to the Lambadis) సముచిత స్థానం కల్పిస్తున్నారని మంత్రి సత్యవతి అన్నారు. ఏడేళ్ళ కాలంలో మేడారం  జాతరకు 350 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని, జోడేఘాట్ లో 26 కోట్లరూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులు (Development works) చేపట్టామని మంత్రి సత్యవతి వివరించారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  మాట్లాడుతూ.. మెస్రం వంశీయులు నాలుగు కోట్ల రూపాయల నిధులను జమ చేసి దేవాలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమన్నారు.

    ఈ ఆలయ నిర్మాణం ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా 50 లక్షల రూపాయల నిధులను (Funds) మంజూరు చేసిందని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు దూపదీప నైవేద్యాలకు నిధులు మంజూరు చేసినట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నాగోబా ఆలయం, జోడేఘాట్, జంగుబాయి ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

    ఆలయంలో మంత్రులు ఇంద్రకరణ్​, సత్యవతి రాథోడ్​


    మంత్రుల ఈ పర్యటనలో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్, శాసన సభ్యులు అజ్మీరా రాఖా నాయక్, రాథోడ్ బాపురావ్, ఆత్రం సక్కు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ల చైర్మెన్ లు జనార్ధన్ రాథోడ్, కోవ లక్ష్మీ, మాజీ ఎంపి జి. నగేష్ తదితరులు పాల్గొన్నారు.

    ఇదిలా ఉంటే కేస్లాపూర్ నాగోబా ఆలయానికి వచ్చిన రాష్ట్ర మంత్రులను ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గొడం గణేష్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని, జి.వో నెంబర్ 317 ను రద్దు చేసి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆ వినత్రి పత్రంలో కోరారు. అక్కడి నుండి నార్నూర్ మండల కేంద్రానికి చేరుకొని పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Festival, Tribes

    తదుపరి వార్తలు