కంటైన్‌మెంట్ జోన్లలో మంత్రి కేటీఆర్ పరట్యన.. ఆందోళన వద్దంటూ హితవు

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కంటైన్ మెంట్ జోన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ అత్యవసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అని అక్కడి వారిని వాకబు చేశారు.

 • Share this:
  కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం ఖైరతాబాద్ పరిధిలోని సీబీఐ క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటైన్‌మెంట్ జోన్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వైరస్ మరింతగా వ్యాప్తి చెందేందుకు పరిమితులు విధించామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రజలతో మాట్లాడి వారి కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ పట్ల అవగాహన ఉందా?, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రచురించిన కరపత్రాలు, ఇతర సమాచారం మీకు చేరిందా అని అడిగి తెలుసుకున్నారు.

  కరొనా వ్యాప్తి, కంటైన్ మెంట్ జోన్ల పరిమితులు, నిబంధనల పైన పూర్తిగా అవగాహన ఉన్నవారు తమ పక్క న ఉన్న వారికి మరింత అవగాహన కల్పించి ఇంటికే పరిమితం అయ్యేలా చూడాలని కోరారు. కరోనా లక్షణాలు కనిపిస్తే స్థానిక అధికారులను సంప్రదించాలని కోరారు. కంటైన్ మెంట్ జోన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ అత్యవసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అని అక్కడి వారిని వాకబు చేశారు. ప్రస్తుతం తమకు అవసరమైన సరుకులు అందుతున్నాయని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు బాగున్నాయని పలువురు స్థానికులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.

  కంటెన్‌మెంట్ జోన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది తోనూ మంత్రి కేటీఆర్ మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, ఈ మేరకు కంటైన్ మెంట్ జోన్లలోని స్థానికులకు కాస్తంత భరోసా ఇచ్చేందుకు తాను స్వయంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో మంత్రి స్వయంగా పర్యటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, తమ నిత్య అవసరాల గురించి కనుక్కోవడం ఎంతో భరోసాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
  Published by:Narsimha Badhini
  First published: