హోమ్ /వార్తలు /తెలంగాణ /

Free Ration: తెలంగాణ రేషన్​ కార్డుదారులకు గుడ్​న్యూస్.. మళ్లీ ఉచితంగా బియ్యం.. ఎప్పటి నుంచంటే?

Free Ration: తెలంగాణ రేషన్​ కార్డుదారులకు గుడ్​న్యూస్.. మళ్లీ ఉచితంగా బియ్యం.. ఎప్పటి నుంచంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో రేషన్​ కార్డుదారులకు మళ్లీ ఉచిత బియ్యాన్ని అందించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

తెలంగాణలో మరోసారి ఉచిత బియ్యాన్ని (Free rice for ration card holders in Telangana) అందించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ (Minister of State for Civil Supplies Gangula Kamalakar.) తెలిపారు. కాగా, కేంద్రం ఇచ్చే 5 కేజీల ఉచిత బియ్యానికి తోడు మరో 5 కేజీలు అంటే మొత్తం ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున రేషన్ అందిస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సాధారణంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా.. జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు 10 కిలోలు ఇవ్వనున్నారు. కాగా, ఉచిత ఆహార పథకాన్ని పొడిగిస్తున్నామని మార్చి 28న కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్, మే నెలల్లో సాంకేతిక కారణాలతో ఉచిత బియ్యాన్ని (Free ration) అందించలేకపోయామని మంత్రి గంగుల అన్నారు. ఈ నెలలో 18 నుంచి 26 వరకు ఉచిత రేషన్ అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

బియ్యం సరఫరాలో ఆలస్యం..

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని (Free ration) తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్‌సీఐ (FCI చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని ఈ సందర్భంగా మంత్రి గంగుల అన్నారు. సాంకేతిక కారణాల వల్ల రెండు నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్‌ నుంచి యథాతథంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. 2020 ఏప్రిల్‌ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చామన్నారు గంగుల. తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్‌ నుంచి ఏప్రిల్‌ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని ఆయన తెలిపారు.

అందుకే ఆలస్యం..

2022లో ఆరు నెలల పాటు ఉచిత బియ్యం  (Free ration) ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని అన్నారు గంగుల. తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని మంత్రి గంగుల వివరించారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు గంగుల. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని మంత్రి గంగుల గుర్తు చేశారు.

తెలంగాణపై చిన్నచూపు..

ఈ ఏడాది జూన్‌ నుంచి తెల్ల రేషన్‌కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్‌ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఈసందర్భంగా  మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు.

First published:

Tags: Free Ration, Gangula kamalakar, Telangana, Telangana ration card

ఉత్తమ కథలు