హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపుపై రాష్ట్ర బీజేపీ నేతలు దీమా వ్యక్తం చేశారు. ఈటల ఎన్నికల్లో గెలుస్తారంటూ సర్వేలు చెబుతున్నాయని పార్టీ నేతలు వెల్లడించారు. కాగా కేంద్రహోంమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు ఇటివల పార్టీలో చేరిన ఈటల రాజేందర్,వివేక్, జితేందర్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు అమిత్ షాను నేడు ఢిల్లీలో కలిశారు.ఈ సంధర్భంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించినట్టు తెలిపారు. ఈటల రాజేందర్ పాదయాత్ర సంధర్భంగా హుజూరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు.
అయితే రాష్ట్ర నేతల ఆహ్వానంపై అమిత్ షా స్పందించారు. తెలంగాణలో పాగా వేసేందుకు ఎన్నిసార్లైనా..వస్తానని చెప్పారని అన్నారు. ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలుపు మాత్రం బీజేపీదేనని అమిత్ చెప్పినట్టు వివరించారు. నివేదికలన్ని ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నాయని అమిత్ షా చెప్పినట్టు వెళ్లడించారు. కాగా హుజూరాబాద్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్దంగా ఉన్నామని పార్టీ అధినేత బండి సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు అభ్యర్థి లేక భయపడుతున్నారని విమర్శించారు. ఈటల పాదయాత్రతో టీఆర్ఎస్ అధికార దహానికి చెక్ పెడతామని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Delhi, Eetala rajender