హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad by Elections : హుజూరాబాద్‌లో హోరెత్తనున్న ప్రచారం.. ఇదిగో ప్రచారాన్ని నిర్వహించేది వీరే.. !

Huzurabad by Elections : హుజూరాబాద్‌లో హోరెత్తనున్న ప్రచారం.. ఇదిగో ప్రచారాన్ని నిర్వహించేది వీరే.. !

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad by elections : హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల వేడి మరింత రాజుకుంటుంది. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాతా ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తించనుంది.

ఇంకా చదవండి ...

కరీంనగర్ జిల్లా న్యూస్ 18తెలుగు కరస్పాండెంట్ శ్రీనివాస్ పి

హుజురాబాద్ అసెంబ్లీ కి జరుగుతున్న ఉప ఎన్నిక (Huzurabad by elections సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్ గా (semi final) ప్రధాన పార్టీలు భావిస్తుండటంతో ఈ ఎన్నికలో విజయం అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకొని ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నా యి . జూన్ నుంచే హుజురాబాద్ ప్రచార జాతర కొనసాగుతుండగా.. ఎన్నికల నోటిఫికేషన్ (election notification )అనంతరం నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో టీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను రంగంలో దించేందుకు సిద్ధ మెంది . నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు ఉండనున్నాయి .

వెయ్యిమందికి మించి సభలు నిర్వహించరాదని ఎన్ని కల కమీషన్ ఆదేశించడంతో ప్రచారం ఇక రోడ్ షోలకే పరిమితం కానున్నాయి . ఇప్పటికే అధికార టీఆర్ఎస్ (trs) ఇంచార్జీలు మంత్రులు తన్నీరు హరీష్ రావు , గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్ , ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తోపాటు మండల , పట్టణాల వారిగా ఉన్న ఇంచార్జీలను తమతమ పరిధిలోని ప్రాంతాలను చుట్టివచ్చారు . వీరితోపాటు కేటీఆర్ మరి కొందరు ముఖ్యనేతలు పర్యటించనున్నారు . ఇక్కడ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ప్రచారం కంటే కేసీఆర్ పథకాలు , ప్రభుత్వ పనితీరుపైనే ఓట్లు అడుగుతూ ఈటల రాజేందర్ పై భాణం ఎక్కుపెడుతూ ముందుకు సాగుతున్నారు .

బీజేపీ (bjp) అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే నియోజవర్గాన్ని చుట్టేశారు . కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు పలు దఫాలుగా పర్యటించారు . ఈ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినర్లను హుజురాబాద్‌కు పంపాలని నిర్ణయించింది . మూడు ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంతో హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం మరింత హోరెత్తనుంది .

ఇక కాంగ్రెస్ (congress )పార్టీ తమ అభ్యర్థిగా ఎన్ఎస్ఎయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఆలస్యంగా ప్రకటించింది . ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు 20 మంది ముఖ్యనేతలు రానున్నారు .

టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు

టీఆర్ఎస్ పార్టీ 20 మంది నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది . ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ , మంత్రులు తన్నీరు హరీష్ రావు , గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్ , ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , నారదాసు లక్ష్మన్ రావు , ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి , వొడితెల సతీష్ కుమార్ , సుంకె రవిశంకర్ , చల్లా ధర్మా రెడ్డి , ఆరూరి రమేష్ , గువ్వల బాలరాజు , పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , నన్నపనేని నరేందర్ , పెద్ది సుదర్శన్ రెడ్డి , సండ్ర వెంకటవీరయ్య , కరీంనగర్ చైర్పర్సన్ కనుమల్ల విజయ , మేయర్ సునీల్‌రావు , సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఉన్నారు . కేటీఆర్ , హరీష్ రావుల రోడ్ షో మ్యాపు

త్వరలో పార్టీ విడుదల చేయనుంది .

బిజెపి స్టార్ క్యాంపెయినర్లు..

బీజేపీ పార్టీ తరపున పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తోపాటు ముఖ్య నేతలు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారానికి రానున్నారు . పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజాసింగ్ , రఘునందన్‌రావు , ఎంపీలు అర్వింద్ , బాబురావు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , పార్టీ కేంద్ర కార్యవర్గంలో ఉన్న డీకే అరుణ , ఓబీసీ సెల్ జాతీయ చైర్మన్ డాక్టర్ లక్ష్మన్ , సినీ నటి విజయశాంతి , రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి , దుగ్యాల ప్రదీప్ రావు , మనోహర్రెడ్డి , రాకేశ్ రెడ్డి , ప్రభాకర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు , ఒకరిద్దరు కేంద్ర మంత్రులు కూడా పర్యటించే అవకాశం ఉంది . పార్టీ హుజురాబాద్ ఇన్చార్జీ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇప్పటికే హుజురాబాద్లో అడ్డావేశారు

కాంగ్రెస్ నుంచి 20 మంది ..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , టీపీసీసీ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్కం ఠాకూర్ తోపాటు 20 మందిని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్లుగా గుర్తించింది .వీరంతా హుజూరాబాద్ ఎన్నికల ప్రచా రానికి రానున్నారు . ఇందులో సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ టీ . జీవన్ రెడ్డి , మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ , పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి , మహేశ్ కుమార్ గౌడ్ , అజారుద్దీన్ , తూర్పు జయప్రకాశ్ రెడ్డి , హుజురాబాద్ ఇన్చార్జీ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహాలతోపాటు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ , మాజీ కేంద్ర మంత్రులు రేణుకాచౌదరి , బలరాంనాయక్ , సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క , ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ , యవ జన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి , కరీంనగర్ , జగిత్యాల , పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షు లు , కరీంనగర్ నగర అధ్యక్షులు , ముఖ్య నేతలను టీపీసీసీ ప్రచారం బాధ్యతలను అప్పగించింది .

.

First published:

Tags: Huzurabad By-election 2021, Karimnagar, Telangana Politics

ఉత్తమ కథలు