• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • SRSP 26 GATES OF SRIRAM SAGAR PROJECT LIFTED AND RELEASED WATER SK

SRSP: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 26 గేట్లు ఎత్తివేత

SRSP: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 26 గేట్లు ఎత్తివేత

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు

26 గేట్లను ఎత్తి 75వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయిలో 1,091 అడుగుల నీటి మట్టం ఉంది.

  • Share this:
    తెలుగు రాష్ట్రాల్లో నదలు ఉప్పొంగుతున్నాయి. ఇక్కడ కురిసే వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదలతో మళ్లీ మహోగ్రరూపం దాల్చాయి. జలాశయాలన్నీ నిండు కుండుల్లా కళకళలాడుతున్నాయి. కృష్ణా నదితో పాటు గోదావరినదిపై ఉన్న ప్రాజెక్టులు కొత్త శోభ సంతరించుకున్నాయి. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. 96,013 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిండిపోయింది. ఈ క్రమంలో 26 గేట్లను ఎత్తి 75వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయిలో 1,091 అడుగుల నీటి మట్టం ఉంది.

    రాత్రి భారీ వర్షాలు కురవడంతో బుధవారం తెల్లవారుజామున 40 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ఐతే ఉదయం 11 గంటల తర్వాత వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో 14 గేట్లను మూసివేసి 26 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం సదర్మత్‌ కాలువ ద్వారా 8 వేలు, కాకతీయ కాలువ ద్వారా 1000, సరస్వతి కాలువ ద్వారా 500, లక్ష్మీ కాలువ ద్వారా 300, వరద కాలువ ద్వారా 10,371 క్యూసెక్కుల చొప్పును నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు