శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీ శాఖ ప్రత్యేక షరతులు

నల్లమల మీదుగా శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక షరతులు పెట్టింది తెలంగాణ అటవీ శాఖ. నల్లమల అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఈ షరతులు విధించింది.

news18-telugu
Updated: February 16, 2020, 12:02 PM IST
శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీ శాఖ ప్రత్యేక షరతులు
శ్రీశైలం ఆలయం
  • Share this:
నల్లమల మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు తెలంగాణ అటవీ శాఖ కొన్ని కండీషన్స్ పెట్టింది. భక్తులు అడవిలో నిర్దేశించిన ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలని ఆదేశించింది. అటవీ మార్గాల్లో కాలి బాటల్లో ప్రయాణంపై నిషేధం విధించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విరామ ప్రాంతాల్లో మాత్రమే సేద తీరేందుకు అనుమతి ఇస్తారు. అక్కడ తాగునీటి సౌకర్యం కూడా కల్పించించారు అటవీ శాఖ అధికారులు. అడవిలో నిప్పు రాజేయటం, వంటలు వండటం నిషేధించారు. ఇటీవల అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది అటవీశాఖ. ఈ నిబంధనలు ఉల్లంఘించి అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వారిపై అటవీశాఖ చర్యలు తీసుకుంటుంది.  నిర్ధేశిత షరతులను పాటించి అడవుల సంరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని భక్తులను కోరింది.

నల్లమల అడవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలతో పాటు రక్షిత అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహించనున్నారు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు