HOME »NEWS »TELANGANA »srisailam fire accident tsgenco cmd prabhakar rao explains to cm kcr sk

Srisailam fire accident: విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Srisailam fire accident: విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ఎగసిపడుతున్న మంటలు

గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని ఆయన చెప్పారు. లోపల అంతా పొగతో నిండిపోయిందని.. ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు ప్రభాకర్ రావు.

  • Share this:
    శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం పట్ల తెలంగాణ సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు సీఎం కేసీఆర్. విద్యుత్ కేంద్రం వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సిఎండి ప్రభాకర్ రావుతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. సహాయక చర్యలను పర్యవేక్షించారు.

    శ్రీశైలం ఎడమగట్టు కాల్వ విద్యుత్ కేంద్రంలో అగ్రిప్రమాదంపై తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రమాదం జరిగిందని తెలిపారు. 1200 కేవీ లైన్‌ను ఐసోలేట్ చేశామని.. ఈ క్రమంలోనే ట్రిప్ అయ్యి ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని ఆయన చెప్పారు. లోపల అంతా పొగతో నిండిపోయిందని.. ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు ప్రభాకర్ రావు. పవర్ హౌస్ లోపల చిక్కుకున్న ఉద్యోగులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌కు వివరించామని ఆయన అన్నారు.




    తెలంగాణ జెన్‌కో మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. జీరో లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు అలుముకున్నాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో 9 మంది టీఎస్ జెన్‌కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. మూడు సార్లు లోపలికి వెళ్లి దట్టమైన పొగ కారణంగా మళ్లీ వెనక్కి వచ్చారు. పొగల తగ్గడంతో పాటు తెల్లవారడంతో మరోసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి నుంచీ లోపల ఉన్న వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:August 21, 2020, 07:20 IST

    टॉप स्टोरीज