HOME »NEWS »TELANGANA »srisailam fire accident ndrf and fire department staff unable to go inside sk

Srisailam fire accident: ఆక్సీజన్ పెట్టుకున్నా లోపలికి వెళ్లలేని పరిస్థితి

Srisailam fire accident: ఆక్సీజన్ పెట్టుకున్నా లోపలికి వెళ్లలేని పరిస్థితి
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

ప్రమాదం జరిగిన గంట వరకు జెన్‌కో సిబ్బంది ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఎవరూ స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో వారికి ఎదైనా జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

  • Share this:
    శ్రీశైలంలోని ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తెలంగాణ జెన్‌కో ఉద్యోగులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐతే దట్టమైన పొగలు అలుముకోవడంతో లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. దట్టమైన పొగలు కారణంగా మూడు సార్లు వెళ్లేందుకు ప్రయత్నించి మళ్లీ వెనక్కి వచ్చారు. ఈ క్రమంలో అధికారులు సింగరేణిని సంప్రదించారు. సింగరేణి బొగ్గు గనుల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. భూగర్భ గనుల్లో ప్రమాదం జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో వారికి అవగాహన ఉంటుంది. ఈ క్రమంలోనే సింగరేణి నుంచి సహాయక బృందాలను రప్పిస్తున్నారు.

    శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో మూడు మార్గాలు ఉన్నాయి. రెండు ప్రవేశ మార్గాలు, ఒక ఎగ్జిట్ మార్గం ఉంది. సొరంగం ద్వారానే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఐతే అంతటా దట్టమైన పొగలు అలుముకోవడంతో ఎవరూ లోపలికి వెళ్లలేకపోతున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన గంట వరకు జెన్‌కో సిబ్బంది ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఎవరూ స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో వారికి ఎదైనా జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే పొగలు తగ్గుతున్నాయని రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎస్పీ, కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.



    చికిత్స పొందుతున్న జెన్కో ఉద్యోగులు


    ప్రమాద సమయంలో 19 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరో తొమ్మిది మంది లోపలే ఉండిపోయారు. బయటకు వచ్చిన వారిలో నలుగురు క్షేమంగా ఉన్నారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థతకు గురి కావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిని మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:August 21, 2020, 06:50 IST

    टॉप स्टोरीज