Srisailam Fire Accident: శ్రీశైలం ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

Srisailam Power Plant fire accident | శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.

news18-telugu
Updated: August 21, 2020, 6:15 PM IST
Srisailam Fire Accident: శ్రీశైలం ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం
  • Share this:
Fire at Srisailam | తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటనపై ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు వారంతా ట్వీట్లు చేసి తమ సంతాపాన్ని ప్రకటించారు. ‘శ్రీశైలం హైడ్రాలిక్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగి మనుషుల ప్రాణాలు పోవడం తీవ్రంగా బాధించింది. ఈ కష్టకాలంలో బాధితుల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.’ అంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.



శ్రీశైలం హైడ్రాలిక్ ప్లాంట్‌లో ప్రమాదం తనను కలచివేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సంతాపం తెలియజేశారు.



శ్రీశైలం టన్నెల్లో అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు.



శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో పలువురు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు.



‘శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయాల పాలైన వారికి అత్యున్నత వైద్యం అందించాలని కోరుతున్నాను.’ అని చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.



శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్), ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ), ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ ), ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్), ఏఈ సుందర్ (సూర్యాపేట) ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా) , జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ) హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 21, 2020, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading