news18-telugu
Updated: February 14, 2020, 12:01 PM IST
శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మంత్రి
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఓ పెళ్లి వేడుకలో ఊహించని షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలోఓ పెళ్లికి హాజరైన శ్రీనివాస్ గౌడ్... తన దగ్గరకు వచ్చిన వారితో సెల్ఫీలు దిగారు. కొంతసేపు అలా వారితో సందడిగా గడిపిన ఆయన.. కొద్దిసేపటికే టెన్షన్ పడటం మొదలుపెట్టారు. ఇందుకు అసలు కారణం ఆయన చేతికి ఉన్న కడియం పోవడమే. చేతికి ఉన్న కడియం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాకైన శ్రీనివాస్ గౌడ్... అది ఏమైందో వెతికిపెట్టాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అనుచరులపై కూడా ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అయితే శ్రీనివాస్ గౌడ్ ఇంతగా అసంతృప్తి చెందడానికి ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తోంది. తన చేజారిపోయిన కడియం ఆయనకు ఎంతో సెంటిమెంట్ అని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఆ కడియం పెట్టుకున్న తరువాత ఆయనకే అనేక విజయాలు దక్కాయని... అందుకే అది కనిపించకుండా పోవడం పట్ల ఆయన బాగా నిరాశ చెందారని పలువురు చెబుతున్నారు. . మరి... కనిపించకుండా పోయిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియం మళ్లీ దొరుకుతుందేమో చూడాలి.
Published by:
Kishore Akkaladevi
First published:
February 14, 2020, 12:01 PM IST