మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియం దొరికేసింది.. ఎలాగో తెలుసా..?

ఎవరైనా కడియం తస్కరించి ఉంటే.. తిరిగి ఇచ్చేయాలని అక్కడికి వచ్చినవారికి విజ్ఞప్తి చేశారట. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి కడియం ఇచ్చి వెళ్లిపోయారు.

news18-telugu
Updated: February 14, 2020, 10:34 PM IST
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియం దొరికేసింది.. ఎలాగో తెలుసా..?
మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • Share this:
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంట్ బంగారం కడియం మళ్లీ దొరికింది. శుక్రవారం ఓ అజ్ఞాత వ్యక్తి దేవరకద్ర పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి కడియం ఇచ్చి వెళ్లాడు. తనకు ఆ కడియం బయట దొరికిందని.. అందుకే తెచ్చిస్తున్నాంటూ చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంట్ చేతి కడియం మళ్లీ దొరకడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ఊహించని అనుభవం ఎదురైంది. గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు శ్రీనివాస్ గౌడ్ హాజరుకాగా.. ఆయన కుడిచేతి బంగారు కడియాన్ని ఎవరో తస్కరించారు. వివాహ వేడుకలో చాలామంది మంత్రితో సెల్ఫీలకు పోటీపడగా.. కాదనలేక ఆయన అందరితో సెల్ఫీలు దిగారు. తీరా సెల్ఫీ తతంగం అయ్యాక చూసుకుంటే.. చేతికి ఉండే కడియం మాయమైంది.

తనను సెంటిమెంట్‌గా భావించే కడియం పోవడంతో..  పోలీసులు, గన్‌మెన్లపై శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయినట్టు తెలిసింది. తన కడియాన్ని దొంగిలించిందెవరో గుర్తించి.. తిరిగి తీసుకురావాలని వారిని ఆదేశించినట్టు సమాచారం. మంత్రి ఆగ్రహంతో పోలీసులు.. పెళ్లి వేడుకకు వచ్చిన వారిని కడియం గురించి ఆరా తీశారు. ఎవరైనా కడియం తస్కరించి ఉంటే.. తిరిగి ఇచ్చేయాలని అక్కడికి వచ్చినవారికి విజ్ఞప్తి చేశారట. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి కడియం ఇచ్చి వెళ్లిపోయారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు